హీరో ఆది డైలామాలో వున్నాడు. చుట్టాలబ్బాయి ఫలితం రాక ముందే కన్నడ రంగాని షిఫ్ట్ కావాలని అనుకున్నాడు. కార్తికేయ, జంటిల్ మన్ లాంటి సినిమాలు సెలెక్ట్ చేసి వుంచుకున్నాడు. అయితే చుట్టాలబ్బాయి మీద కాస్త హోప్ వుండడంతో , దాని రిజల్ట్ కోసం ఆగాడు.
ఓపెనింగ్స్ ఫరవాలేదు అనిపించుకున్నా, ఆ తరువాత డల్ అయిపోయాయి కలెక్షన్లు. పైగా ఈ సినిమా వైజాగ్ రైట్స్ ను ఆదికే ఇచ్చేసారు రెమ్యూనిరేషన్ కింద. దాన్ని వేరే వాళ్ల ద్వారా విడుదలకు ఏర్పాట్లు చేసుకున్నారు ఆది తండ్రి సాయి కుమార్. ఇప్పుడు అక్కడ టూర్ లు గట్రా చేసి, కాస్తయినా డబ్బులు రాబట్టుకోవాలని చూస్తున్నాడు.
అయితే ఇక తెలుగులో చేయడమా, కన్నడంలోకి వెళ్లడమా అని ముందు వెనుక ఆలోచిస్తున్నాడట ఆది. కొత్తగా స్క్రిప్ట్ లు ఏవీ రాలేదు. ఎవరైనా మాంచి హిట్ గ్యారంటీ స్క్రిప్ట్ తో వస్తే, చివరాఖరు ప్రయత్నంగా తానే ప్రొడ్యూస్ చేసి కొడుకును నిలబెట్టాలన్నది సాయికుమార్ ఆలోచనగా వుంది. అది కాకపోతే ఇక కన్నడ రంగానికి వెళ్లాలని. అంత గొప్ప సబ్జెక్ట్, డైరక్టర్ వుంటే ఆది దగ్గరకు ఎందుకు వస్తారు? పెద్ద హీరోల వెంట పడతారు తప్ప.