Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆదుకున్న ఎన్టీఆర్ ను వదిలేస్తారా?

ఆదుకున్న ఎన్టీఆర్ ను వదిలేస్తారా?

అజ్ఞాతవాసి విడుదల తరువాత సమయం. అంత వరకు జోష్ మీద వున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కసారిగా నిరాశలో మునిగిపోయేలా చేసింది ఆ సినిమా. అలాంటి టైమ్ లో ఆయనతో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన హీరో ఎన్టీఆర్. ఆ సినిమా ఏ రేంజ్ హిట్ అన్న సంగతి పక్కన పెడితే, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మళ్లీ హుషారు తీసుకువచ్చింది. ఆ హుషారులో అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ సినిమా బయటకు వచ్చింది. 

ఇదిలా వుంటే అజ్ఞాతవాసి సినిమా వల్ల నష్టపోయిన వారిని వెంటనే ఆదుకుని, డబ్బులు వెనక్కు ఇచ్చిన సంస్థ హారిక హాసిని. త్రివిక్రమ్ తరపున మైత్రీ మూవీస్ కు డబ్బులు సెటిల్ మెంట్ చేసి, 11 కోట్లు ఖర్చు చేసిన సంస్థ హారిక హాసిని. అలాంటి సంస్థ త్రివిక్రమ్ తో వరుసగా సినిమాలు ప్లాన్ చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, బన్నీ ఇలా నలుగురు హీరోలతో నాలుగు సినిమాలు ప్లాన్ చేసి పెట్టుకున్నారు. మిగిలిన వాటి సంగతి అలా వుంచితే, ఎన్టీఆర్ సినిమా అయితే పక్కాగా ఇప్పుడు చేయాల్సిందే.

ఇలాంటి టైమ్ లో మహేష్ తరపున నమ్రత తన వ్యూహరచన ప్రారంభించినట్లు బోగట్టా. లాయిడ్ సంస్థకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ కనుక, ఒకటి రెండు ప్రకటనలు రూపొందించే పని చేపట్టమని ఆమె స్వయంగా త్రివిక్రమ్ ను కోరినట్లు తెలుస్తోంది. ఆ విధంగా అభి బస్ యాడ్ తరువాత మళ్లీ త్రివిక్రమ్ ను మహేష్ ను ఓ లైన్ మీదకు తేవాలన్నది ఆమె ప్లాన్ గా తెలుస్తోంది.

ఇదే టైమ్ లో ప్లాన్ బి కూడా వుంది. దిల్ రాజు కు ఎప్పటి నుంచో త్రివిక్రమ్ తో సినిమా చేయాలని కోరిక వుంది. అందువల్ల హారిక-దిల్ రాజు బ్యానర్లు కలిపి మహేష్ తో సినిమా ప్లాన్ చేస్తే..? ఈ ప్లాన్ బి వెనుక కూడా నమ్రత ప్లానింగ్ వుందని తెలుస్తోంది.

కానీ హారిక హాసినికి మాత్రం ఇప్పట్లో మహేష్ తో సినిమా చేసే ఆలోచన లేదు. ఆ ఉద్దేశమూ లేదు. త్రివిక్రమ్ మరీ బలవంతం చేస్తే తప్ప. ఎందుకంటే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కాస్త ఆలస్యం అయిందని మహేష్ దగ్గరకు వెళ్తే ఎన్టీఆర్ ను హర్ట్ చేసినట్లు అవుతుంది., పైగా మహేష్ దగ్గరకు వెళ్లి ఆ తరువాత ఎన్టీఆర్ దగ్గరకు వచ్చినా, ఇప్పటికే ప్లాన్ చేసిన మిగిలన హీరోలతో సినిమాల లైనప్ అంతా పాడైపోతుంది.

అందుకే ఒకవేళ ఎన్టీఆర్ రావడం లేటు అవతుందీ అనుకుంటే, ఆయన అనుమతితో, ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలనుకుంటున్న వెంకటేష్ తో చేసేయాలనే ఆలోచన కూడా వుంది. గతంలో వెంకటేష్ తో ఓ సినిమా ప్రకటించి వున్నారు. అది అలా ఆగిపోయి వుంది కూడా. మొత్తం మీద నమత్ర వ్యూహం-దిల్ రాజు ప్లానింగ్ అంత సులువుగా నెరవేరకపోవచ్చు అని తెలుస్తోంది.

చంద్ర‌బాబు ఆ డాక్టర్‌తో మంచి నాటకం ఆడించారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?