అమీర్ సినిమా కోసమే టెన్షనంతా?

రాజమౌళి బాహుబలి విజయం కన్నా, ఆ సినిమా హిందీ వెర్షన్ సక్సెస్ కోసం తహతహలాడుతున్నాడని టాలీవుడ్ గుసగసుల సారాంశం. మళ్లీ వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాలంటే టాలీవుడ్ లో అంత సులువు గాదు.…

రాజమౌళి బాహుబలి విజయం కన్నా, ఆ సినిమా హిందీ వెర్షన్ సక్సెస్ కోసం తహతహలాడుతున్నాడని టాలీవుడ్ గుసగసుల సారాంశం. మళ్లీ వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాలంటే టాలీవుడ్ లో అంత సులువు గాదు. ప్రతి సారీ బాహుబలి సాధ్యం కాదు. పైగా నేషనల్ ఫేమ్ కావాలంటే, మాంచి బాలీవుడ్ సినిమా చేయాలి. 

అందుకే అమీర్ ఖాన్ తో సినిమా చేయాలన్నది రాజమౌళి ఆలోచన అని టాక్ వినిపిస్తోంది. రాజమౌళి చేస్తానంటే చేసేందుకు నేషనల్ వైడ్ గా చాలా మంది హీరోలు రెడీనే. కానీ రాజమౌళి మాత్రం అమీర్ ఖాన్ కే గురిపెట్టాడని టాక్. 

అది సాధ్యం కావాలంటే, బాహబలి హిందీ వెర్షన్ సూపర్ సక్సెస్ కావాలి. దాని కోసమే శ్రమిస్తున్నాడు రాజమౌళి అంటున్నారు టాలీవుడ్ జనాలు.