సీరియస్ గా ఆలోచించి సినిమా తీయాలే కానీ, దర్శకుడు పూరి జగన్నాధ్ బుల్స్ ఐ ని కొట్టినట్లే. కానీ గురువు రామ్ గోపాల్ వర్మ మాదిరిగానే అంతా టేకిట్ ఈజీ పాలసీ. ఆయన సినిమాల సబ్జెక్ట్ లు ఏవి తీసుకోండి.కత్తిలాంటి సబ్జెక్ట్ లే. కెమేరామెన్ గంగతో రాంబాబు, టెంపర్, లోఫర్..జ్యోతిలక్ష్మి..ఇలా. కానీ వాటిని చూస్తే మాత్రం..పూరి మరికాస్త శ్రద్ధ తీసుకుని వుంటే ఆ సినిమాల రేంజ్ ఎక్కడో వుండేది కదా అనిపిస్తుంది. పూరి నిన్నటి సినిమాల్లో ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఫన్, కామెడీ, ఫైట్లు ఇవన్నీ ఓ రేంజ్ లో వుండేవి. కానీ ఇటీవల అవన్నీ అలా అలా టచ్ చేసి వదుల్తున్నట్లు అనిపిస్తుంది.
సరే వర్తమానానికి వస్తే ఇజం అంటూ కళ్యాణ్ రామ్ తో సినిమా ఫుల్ స్పీడ్ తో షూటింగ్ పార్ట్ నడుస్తోంది. అంతకు ముందు రోగ్ అనే సినిమా ఫినిష్ చేసేసారు. కానీ దాని ఫస్ట్ లుక్, ఇంకోలుక్ ఇలాంటివి ఏవీ తెలియదు..ఆ సినిమా పరిస్థితీ తెలియదు. ఆ సంగతి అలా వుంచితే ఇజం ఫస్ట్ లుక్ చూసిన వాళ్లందరికీ ఒకటే సందేహం. లోఫర్ లుక్ నే కాస్త అటు ఇటు చేసి ఇజం లుక్ గా మార్చినట్లుంది కదా? అని.
అలాగే పూరికి మీడియా, పాలిటిక్స్ మీద కొన్ని రాడికల్ థాట్స్ వున్నాయి. అవి గతంలోని ఆయన సినిమాల్లో చాలా వరకు తొంగిచూసాయి. కెమేరామెన్ గంగతో రాంబాబు, నేనింతే సినిమాల్లో ఈ విషయం తెలుస్తుంది. ఇజం లోగో వైనం, ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ ప్రెస్ రిపోర్టర్ గా చేయడం వంటి వైనాలు చూస్తుంటే మళ్లీ పూరి తన స్వంత భావనల మాటల బాంబులను తెరపై పేల్చే పనిలో వున్నట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, గతంలోని సినిమాల్లోని మాటలు కూడా తూటాల్లా పేలినవే. బిట్లు బిట్లు గా సూపర్ గా వున్నవే..సినిమాగా డీలా పడేసినవే.
అయితే ఈసారి పూరి ఫుల్ కేర్ తీసుకుంటారనే అందరూ అనుకుంటున్నారు. అలాంటి టైమ్ లో ఈ ఫస్ట్ లుక్ వచ్చి, మళ్లీ పూరి ఈ సారి కూడా టేకిట్ ఈజీ అనేయరుకదా అని భయపడుతున్నారు.