ఆచార్య అసలు లెక్కలు వేరా?

ఆచార్య సినిమా బిజినెస్ లెక్కలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. ఫిగర్లు వింటుంటే జనం 'అవునా' అని అనుకుంటున్నారు. ఓవర్సీస్ 11 కోట్లు, నైజాం 42 కోట్లు, ఆంధ్ర 60 కోట్ల రేషియో ఇలా…

ఆచార్య సినిమా బిజినెస్ లెక్కలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. ఫిగర్లు వింటుంటే జనం 'అవునా' అని అనుకుంటున్నారు. ఓవర్సీస్ 11 కోట్లు, నైజాం 42 కోట్లు, ఆంధ్ర 60 కోట్ల రేషియో ఇలా ఫిగర్లు వినిపిస్తున్నాయి. 

దర్శకుడు కొరటాల శివ సినిమాలకు ఓ ప్రత్యేకత వుంది. మరే పెద్ద సినిమాకు అయినా బిజినెస్ నిర్మాతే చూసుకుంటారు. కానీ కొరటాల సినిమాల బిజినెస్ ఆయన మాత్రమే చూస్తారు. 

నిర్మాత నిమిత్తమాత్రుడే. పైగా బయ్యర్లలో చాలా మంది కొరటాల సన్నిహితులే, రెగ్యులర్ బ్యాచ్ నే వుంటుంది. దీని వల్ల మరో ఉపయోగం కూడా వుంది. సినిమా విడుదలయిన తరువాత అసలు సిసలు ఫిగర్లు వారికి తప్ప మరొకరికి తెలియవు. వారు వదలిన ఫిగర్లే ఫిక్స్ అవుతాయి. 

ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న ఆచార్య ఫిగర్లు, అసలు ఫిగర్లు వేరు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర 60 కోట్ల రేషియో అన్నారు కానీ అసలు ఫిగర్ 50 రేషియో అన్న టాక్ వుంది. అలాగే నైజాం 42 కోట్లు అన్నది కూడా వాస్తవం కాదన్న టాక్ వినిపిస్తోంది. 

దిల్ రాజు 33 వరకు వెళ్లారని వరంగల్ శ్రీనుకు 36 కోట్లకు ఇచ్చారని బోగట్టా. ఓవర్ సీస్ ఫిగర్ మీద కూడా రెండు రకాల వార్తలు వున్నాయి. ఒకటి 11 కొట్లు అని కాదు అయిదు కోట్లు మినిమమ్ గ్యారంటీ ఒక కోటి రిటర్న్ బుల్ అడ్వాన్స్ అని. 

ఏమైనా ముందే చెప్పినట్లు కొరటాల సినిమాల అసలు ఫిగర్లు ఎవరికీ తెలియవు. నిర్మాతకు, దర్శకుడికి, బయ్యర్లకు తప్ప. అవి కొనుగోలు రేట్లు అయినా, వసూళ్లు అయినా. 

నెక్స్ట్ సినిమా లీక్‌ చేసిన చిరంజీవి..

ఆ కలాల వెనుక కులాల ఎజెండా