‘ఆచార్య..ఎవ్వరూ..ఎక్కడా మాట్లాడవద్దు’

''…డియర్ కమిటీ మెంబర్స్.. Advertisement “…ఆచార్య” సినిమా కధా వివాదం.. విషయమై.. గౌరవ మన కమిటీ సభ్యులు ఎవరూ కూడా.. సోషల్ మీడియా లోగాని.. వెబ్ మీడియా లోగాని.. ఫ్రింట్ మీడియా లోగాని.. ఎలక్ట్రానిక్…

''…డియర్ కమిటీ మెంబర్స్..

“…ఆచార్య” సినిమా కధా వివాదం.. విషయమై.. గౌరవ మన కమిటీ సభ్యులు ఎవరూ కూడా.. సోషల్ మీడియా లోగాని.. వెబ్ మీడియా లోగాని.. ఫ్రింట్ మీడియా లోగాని.. ఎలక్ట్రానిక్ మీడియా లోగాని మాట్లాడకూడదని.. మనవి. రచయితల సంఘం.. దర్శకుల సంఘం.. ఈ విషయమై చర్చించిన తర్వాతే.. మన స్పందన తెలియజేద్దాం.. థాంక్యూ….''

ఆచార్య కథ వివాదం విషయంలో ఇలాంటి మెసేజ్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది.  రాజేష్ అనే అసోసియేట్ తాను రాసుకున్న కథను, మైత్రీ మూవీస్ సంస్థకు చెప్పానని, అది ఎలా వెళ్లి, ఎలా మారిందో, ఆచార్య సినిమాగా వస్తోందని, తనకు న్యాయం చేయాలని మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  తనకు అసోసియేషన్ల దగ్గర న్యాయం జరగలేదని, అసోసియేషన్ల తన సమస్య పరిష్కరించకపోగా, కోర్టుకు వెళ్లమని ఉచిత సలహా ఇచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. 

ఇలాంటి నేపథ్యంలో గ్రేట్ ఆంధ్రతో ఎక్స్ క్లూజివ్ గా రాజేష్ మాట్లాడిన మాటలు టాలీవుడ్ లో సంచలనం కలిగించాయి. ఆ తరువాత మెయిన్ స్ట్రీమ్ చానెళ్లు కూడా రాజేష్ ను ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించాయి. ఇదంతా చినికి చినికి గాలివానగా మారేలా కనిపించడంతో, డైరక్టర్ల సంఘం ఈ మేరకు తన సభ్యలకు ఓ మెసేజ్ ను పంపినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. 

మెగాస్టార్ కు తెలుసా?

ఇదిలా వుంటే ఈవిషయం అంతా మెగాస్టార్ చిరంజీవికి తెలిస్తే తనకు న్యాయం చేస్తారని రాజేష్ చాలా ఆశాభావంతో వున్నారు. కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ఏమిటంటే, ఈ విషయం ఇప్పటికే మెగాస్టార్ దృష్టికి వెళ్లిందని, ఇది జరిగి కొన్ని నెలలు అయిందని తెలుస్తోంది. డిసెంబర్ నుంచే ఇది రగులుతోందని, ముందుగా కొన్ని రాజీ ప్రయత్నాలు జరిగాయని, కానీ ఎందుగో అవి బెడిసి కొట్టిన తరువాత రాజేష్ సంఘాల్లో ఫిర్యాదు చేసారని తెలుస్తోంది. 

కానీ కొందరు పెద్దల అన్యాపదేశాల కారణంగా రాజేష్ సమస్యను కోర్టులకు వదిలేసారని బోగట్టా. అయితే రాజీప్రయత్నాల కన్నా బెదిరింపులే ఎక్కువగా జరిగాయని రాజేష్ అంటున్నారు. మొత్తం మీద ఆచార్య కథ ఉదంతం కాస్త గట్టి సంచలనాలకు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది.

బాలయ్య కోసం ఈ కథ రాసుకున్నా

ఆర్ ఆర్ ఆర్  తర్వాత తారక్ ని ఆపలేం