అదే పూరి జగన్‌ లైఫ్‌ యాంబిషన్‌

డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో అన్‌వాంటెడ్‌ పబ్లిసిటీ దక్కడంతో బాగా ఇరిటేట్‌ అయిపోయిన పూరిజగన్నాథ్‌ తన ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసింది మీడియానే అని పేర్కొన్నాడు. అయితే ఈ సంఘటన తర్వాత తను తీసే సినిమాల తీరులో…

డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో అన్‌వాంటెడ్‌ పబ్లిసిటీ దక్కడంతో బాగా ఇరిటేట్‌ అయిపోయిన పూరిజగన్నాథ్‌ తన ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసింది మీడియానే అని పేర్కొన్నాడు. అయితే ఈ సంఘటన తర్వాత తను తీసే సినిమాల తీరులో ఏ మార్పు రాదని తేల్చేసాడు. అయితే జనగణమన చిత్రాన్ని చేయడం మాత్రం జీవిత ధ్యేయంగా పెట్టుకున్నట్టు చెప్పాడు.

సమాజంలో జరిగే ఎన్నో అంశాలని ఇందులో చూపిస్తానని, తనపై నిందలు వేసిన వారెవరూ ఇలాంటి కథ రాయలేరని, తాను సినిమా తీస్తానని, జనం చూస్తారని జగన్‌ అన్నాడు. 'ఐ లవ్‌ ఇండియా ఐ హేట్‌ ఇండియన్స్‌' అనే ట్యాగ్‌లైన్‌తో భారతీయ స్వభావాన్ని ఎండగడతానని పూరి అన్నాడు.

ఈ కథనే మహేష్‌కి చెబితే అతను రిజెక్ట్‌ చేసాడు. ఆ తర్వాత వెంకటేష్‌కి చెప్పినా కానీ వర్కవుట్‌ అవలేదు. మరి పూరి లైఫ్‌ యాంబిషన్‌ అయిన ఈ సినిమాని ఎవరు చేస్తారో ఏమిటో అనేది వేచి చూడాలి.