ఇటీవల కొత్త సినిమా విడుదలప్పుడు, లేదా పెద్ద సినిమాలు షూటింగ్ దశల్లో వున్నపుడు అద్భుతమైన కాంబినేషన్లతో సినిమా రానున్నట్లు వదంతులు రావడం మామూలైంది. వాటిని అడ్డం పెట్టకుని, చేతిలో వున్న సినిమాలను గట్టెక్కించుకోవడం షరా మామూలైంది. ఆ మధ్య బాలయ్య-రాజమౌళి కాంబినేషన్ అని ఓ వదంతి గుప్పుమంది.
ఇప్పుడు అలాగే అడ్డాల శ్రీకాంత్-జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటూ మరో వదంతి.వీరిద్దరి మధ్య కథా చర్చలుకూడా జరిగాయని వదంతి ఇప్పుడు తాజగా గుప్పు మంది. నిజానికి జూనియర్ కు శ్రీకాంత్ కు నడుమ అలాంటి చర్చలేవీ జరగలేదని, ఈ వదంతి చెలరేగడం వెనుక ఓ పెద్ద సంస్థ ఎత్తుగడ దాగివుందని తెలిసింది. ఎన్టీఆర్ ఆఫీసు వ్యవహారాలు తెలిసిన వర్గాలు కూడా ఇలాంటి డిస్కషన్ జరగలేదనే అంటున్నాయి.
ఈ సంస్థ ప్రస్తుతం ఓ భారీ సినిమా నిర్మాణంలో బిజీగా వుంది. అందులో కాస్త ఆర్థిక ఒడిదుడుకులు వుండడంతో ఇలాంటి వదంతి పుట్టించినట్లు టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. దీన్ని అడ్డం పెట్టకుని ఆ సినిమాను గట్టెక్కించాలన్నది ప్లాన్ గా కనిపిస్తోందంటున్నారు.