బాహబలి 2 పోస్టర్ విడుదలయింది. అనుష్క, ప్రభాస్ ల జంట చూడముచ్చటగా వుంది. అయితే అనుష్కను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఇంత నాజూగ్గా ఎలా వుంది అనుష్క అని. ముఖ్యంగా సైజ్ జీరో సినిమా తరువాత అనుష్క పరిస్థితి అందరికీ తెలిసిందే. లేటెస్ట్ గా వస్తున్న సింగం 3 స్టిల్స్, ట్రయిలర్లలో కూడా అనుష్క ఎలా వుందో అందరూ చూసారు.
అయితే ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల గుసగుసల సారాశం ఏమిటంటే, ఈ స్టిల్ ఇప్పటిది కాదట.బాహుబలి వన్ తీస్తున్నపుడే బాహుబలి రెండో భాగాన్ని నలభై శాతానికి పైగా పిక్చరైజ్ చేసారు. ఇది అప్పటిది అన్నది ఆ గుసగుసల సారాంశం.
ఇదిలా వుంటే ఎంతకీ బాహుబలి 2 కి బజ్ రావడం లేదు. అందునా ఖైదీ నెం 150 వచ్చి రికార్డులు అన్నీ తుడిచేసాక, మళ్లీ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఇప్పటి నుంచీ దాన్ని ఎత్తుకోకపోతే కష్టం. బాహుబలి వన్ ను అయితే మీడియా అమాంతంగా మోసింది.
ఈసారి అలా మోసేంత సీన్ అయితే లేదు. వన్ సమయంలోనే బాహుబలి టీమ్ బాలీవుడ్ మీడియాతో వ్యవహరించిన తీరు, టాలీవుఢ్ మీడియాను పట్టించుకోని తీరును ఇంకా మరిచిపోలేదు. అందువల్ల ఇవన్నీ కలిసి బాహబలి 2 విషయంలో ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే ఓ సరైన స్టిల్ వదిల్తే కొన్నాళ్లు హడావుడి వుంటుందని, ఈ స్టిల్ వదిలారన్నది టాలీవుడ్ గుసగుసల సారాంశం.