పెళ్లి చూపులు సినిమా సల్మాన్ బాలీవుడ్ లోకి తీసుకెళ్లిపోతున్నాడంటూ పది రోజుల క్రితం గ్యాసిప్ లు గుప్పుమన్నాయి. అప్పుడే చెప్పాం..ఇదో అలవాటుగా మారింది టాలీవుడ్ లో అని. ఇలా చెప్పిన చాలా సినిమాలు ఇంత వరకు బాలీవుడ్ గడప కూడా తొక్కలేదని. ఇక పెళ్లి చూపులు రీమేక్ వైనం కూడా ఇంకా చాలా అంటే చాలా దూరంగా వుందని ఇప్పుడు స్పష్టమైంది.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారట సల్మాన్ కు. 'చూడండి..బాగుంది సినిమా' అని. దానికి సల్మాన్ అలాగే చూద్దాం అన్నాడట. అలాగే పెళ్లి చూపులు డైరక్టర్ తదితరులు సల్మాన్ బంధువును కలిసి చెబితే, సల్మాన్ షూట్ లో బిజీగా వున్నారు వచ్చాక చూస్తారు అన్నారట. అదీ విషయం.
సల్మాన్ చూడాలి. బాలీవుడ్ కు ఈ సినిమా సెట్ అవుతుందని అనుకోవాలి. అప్పుడు రీమేక్ అన్నది. అప్పటిదాకా గ్యాసిప్ ల్లోనే. అయినా బాలీవుడ్ లో యూత్ ఫిలింస్ అంటే పరమ బూతు ఫిలింస్ వస్తున్నాయి. ఇలాంటి నీట్ గా వున్న సినిమా వాళ్లకు ఎక్కుతుందా?