పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్‌కి భయపడుతున్నారా?

పవన్‌కళ్యాణ్ ముందుగా మొదలు పెట్టిన సినిమాను కూడా వెనక్కు నెట్టి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకోవడం అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.  Advertisement ఇద్దరు హీరోల మధ్య పోటాపోటీగా సాగే…

పవన్‌కళ్యాణ్ ముందుగా మొదలు పెట్టిన సినిమాను కూడా వెనక్కు నెట్టి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకోవడం అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఇద్దరు హీరోల మధ్య పోటాపోటీగా సాగే కథాంశమున్న ఆ చిత్రం పవన్ ఇమేజ్‌కి ఎలా సూట్ అవుతుందనేది ఇప్పటికీ ఫాన్స్‌ని తొలుస్తోన్న ప్రశ్న. 

పవన్ కళ్యాణ్ ఇమేజ్ గురించి బాగా తెలిసిన త్రివిక్రమ్‌తో సదరు కథకు మార్పులు చేయించి మాటలు కూడా రాయిస్తున్నారట. ఇంతవరకు బాగానే వుంది కానీ పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కాస్త ఫామ్‌లో వున్న హీరోలెవరూ అంగీకరించడం లేదట. 

పవన్ కళ్యాణ్ వుంటే కచ్చితంగా అతని పాత్రకు వెయిట్ ఎక్కువ ఇస్తారు కనుక ఆ చిత్రంలో నటించడం వల్ల తమకు పెద్దగా ప్రయోజనం వుండదని భావిస్తున్నారట. 

ఈ చిత్రానికి రచన చేస్తోన్న త్రివిక్రమ్ కూడా పవన్‌కి బెస్ట్ ఫ్రెండ్ కావడం వల్ల అతను ఆ పాత్రను మరింత స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దుతాడని, వేరే పాత్రను తగ్గిస్తాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. 

ఇదే కారణంగా ఇంతవరకు ఈ చిత్రానికి రెండో హీరో ఖాయం కాలేదని, షూటింగ్ మొదలు పెట్టడానికి పవన్ సిద్ధంగా వున్నప్పటికీ ఈ రెండవ కథానాయకుడి సమస్య మేకర్స్‌ని అయోమయానికి గురి చేస్తోందట. 

అధికార పార్టీలో అదే చర్చ