అజ్ఞాతవాసి బయ్యర్ కు హ్యాండిచ్చారు

అజ్ఞాతవాసి. ఈ ఏడాది ఆరంభంలో మోస్ట్ ప్రామిసింగ్ సినిమా. ఈ సినిమా వల్ల దారుణంగా దెబ్బతిన్నది ఎవరు అంటే నిర్మాత చినబాబు కాదు. ఓవర్ సీస్ బయ్యర్ ఎల్ ఎ తెలుగు మూవీస్ జనాలు.…

అజ్ఞాతవాసి. ఈ ఏడాది ఆరంభంలో మోస్ట్ ప్రామిసింగ్ సినిమా. ఈ సినిమా వల్ల దారుణంగా దెబ్బతిన్నది ఎవరు అంటే నిర్మాత చినబాబు కాదు. ఓవర్ సీస్ బయ్యర్ ఎల్ ఎ తెలుగు మూవీస్ జనాలు. భారీ రేటుకు ఓవర్ సీస్ హక్కులు కొని, అత్యంత దారుణంగా దెబ్బతిన్నారు. సినిమా విడుదల తరువాత నిర్మాత చినబాబు చాలామంది బయ్యర్లకు వీలయినంత సర్దుబాటు చేసారు కానీ, ఓవర్ సీస్ బయ్యర్ కు మాత్రం పెద్దగా చేయలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.

రాబోయే సినిమాలు ఇచ్చే ఆలోచన చేస్తామని అప్పట్లో చెప్పినట్లు కూడా వినిపించింది. ఆ ఆశతోనే వుంటూ వచ్చారు ఓవర్ సీస్ బయ్యర్లు. కానీ ఇప్పడు వ్యవహారం చూస్తుంటే ఓవర్ సీస్ బయ్యర్ కు హ్యాండిచ్చినట్లే కనిపిస్తోంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్, మారుతి-నాగ్ చైతన్య, శర్వా-సుధీర్ వర్మ సినిమాలు మూడు కలిపి, గంప గుత్తగా బ్లూస్కయ్ జనాలకు ఇచ్చేసారని టాక్ వినిపిస్తోంది. ఈ మూడు ప్యాకేజ్ కలిపి ఆరంభంలో 18కోట్లు అని వినిపించింది. కానీ ఈ మూడు సినిమాలకు కలిపి అంత సీన్ లేదని కూడా వినిపించింది. 

అయితే ఇవ్వలేదని, ఇప్పట్లో ఇచ్చేదిలేదని హారిక హాసిని వైపు నుంచి వినిపించింది. అయితే అదంతా కేవలం అజ్ఞాతవాసి డిస్ట్రిబ్యూటర్ ను మబ్బులో వుంచడానికే అని వినిపిస్తోంది. మూడు సినిమాలు కలిపి 13.5 కోట్లకు బ్లూస్కయ్ జనాలకు అప్పగించేసారని వినికిడి. అయితే ఇచ్చేసామని చెబితే, ఇప్పటి నుంచీ ఎందుకు తకరారు అని ఇవ్వనట్లు చెబుతున్నారని అంటున్నారు. 

ఇంత పడిపోయిందా?

ఎన్టీఆర్ ఓవర్ సీస్ మార్కెట్ ఎలాగూ తక్కువే. మరి త్రివిక్రమ్ కు ఏమయింది? 13.5కోట్లలో చైతూ సినిమానే మూడున్నర కోట్ల వరకు వుంటుంది. ఇంకా శర్వా సినిమా వుంది. అది ఓ రెండున్నర కోట్లు తీసేస్తే ఎన్టీఆర్ సినిమా 7.5 కోట్లకు వచ్చినట్లు.

మరి ఇంతచౌకగా ఇచ్చేదేదో? ఆ యుఎస్ తెలుగు సినిమా జనాలకే ఇవ్వవచ్చుగా? అక్కడే సెంటిమెంట్ ప్లే చేసినట్లు తెలుస్తోంది. అజ్ఞాతవాసి మిజరబుల్ ఫెయిల్యూర్ తో, హారిక హాసిని జనాలు ఆ ఓవర్ సీస్ బయ్యర్ ను సెంటిమెంట్ గా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే పక్కనపెట్టి పాత బయ్యర్ బ్లూస్కయ్ కే ఇచ్చినట్లు టాక్.