అజ్ఖాతవాసి కేరాఫ్ టీవీ5 @ 85లక్షలు

అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ ప్లేస్, డేట్ ఇంకా సరిగ్గా ఫిక్స్ కాలేదు కానీ, ఆడియో ఫంక్షన్ ప్రసార హక్కులు మాత్రం ఇచ్చేసారు. 80 నుంచి 85 లక్షల రేంజ్ లో ప్రసార హక్కుల కోసం…

అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ ప్లేస్, డేట్ ఇంకా సరిగ్గా ఫిక్స్ కాలేదు కానీ, ఆడియో ఫంక్షన్ ప్రసార హక్కులు మాత్రం ఇచ్చేసారు. 80 నుంచి 85 లక్షల రేంజ్ లో ప్రసార హక్కుల కోసం చెల్లించి, దాన్ని స్వంతం చేసుకుంది టీవీ5. పైగా ఇది సోలో లైవ్ ప్రసారం కావడం విశేషం. 

సాధారణంగా ఓ ఎంటర్ టైన్ మెంట్ చానెల్, ఓ న్యూస్ చానెల్ లైవ్ ప్రసారం చేస్తుంటాయి. అజ్ఞాతవాసి శాటిలైట్ హక్కులు జెమిని టీవీవి. అందువల్ల ఎంటర్ టైన్ మెంట్ చానెల్ గా జెమిని కూడా లైవ్ ప్రసారం చేయాలి. కానీ చేయడం లేదని తెలుస్తోంది.

అందువల్ల సోలో లైవ్ ప్రసార హక్కులు టీవీ5 నే దక్కించుకుంది. ఇందుకోసం భారీ డీల్ నే సెట్ చేసుకుంది. 85 లక్షల మేర డీల్ లో ప్రకటనల రూపంలో ఎంత? క్యాష్ రూపంలో ఎంత అన్నది ఇంకా బయటకు రాలేదు. కానీ యాభై లక్షలు క్యాష్ పేమెంట్ వుంటుందని టాక్ వినిపిస్తోంది. 

ఇదిలా వుంటే ఎవరికి వారే తామే ఈవెంట్ చేయబోతున్నామని అంటున్నారు. అజ్ఞాతవాసి ఈవెంట్ మేనేజ్ మెంట్ కోసం కూడా చాలా మంది పోటీ పడుతున్నారు. మరి దాంతో లింక్ పెట్టి ఇచ్చారో? లేక అది వేరే డీల్ నో అన్నది కూడా ఇంకా బయటకు రాలేదు.

ఫంక్షన్ చేయాలంటే కనీసం ముఫై నుంచి నలభై లక్షలు ఖర్చవుతుంది. మరి దానికి వేరే స్పాన్సర్లను చూసుకోమంటారా? అన్నది తెలియాలి. అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ 21 లేదా 22న హెచ్ఐసిసి లో జరిగే అవకాశం వుంది.