Advertisement


Home > Movies - Movie Gossip
అఖిల్.. డేట్ దాటిపోయింది

అఖిల్ సినిమా తరువాత హలో సినిమా చేయడానికి బోలెడంత గ్యాప్. ఇప్పుడయినా చకచకా సినిమాలు చేస్తాడా? అఖిల్ అన్నది క్వశ్చను. దానికి అఖిల్ నే సమాధానం చెప్పాడు. జనవరి 10 కల్లా కొత్త ప్రాజెక్టు వివరాలు చెబుతా అంటూ. దాంతో సినిమా ఫ్యాన్స్ జనవరి 10 కోసం ఎదురుచూసారు. ఈలోగా కొరటాల శివ పేరు కూడా లింక్ అయింది.

కానీ కొరటాల శివ చూపు ప్రభాస్ వైపు వుందని బయటకు వచ్చింది. అదే టైమ్ లో సాధ్యం అవుతుందా అనే అనుమానం వచ్చే మరో వార్త కూడా బయటకు వచ్చింది. రానా ప్రొడక్షన్ లో సత్య పినిశెట్టి డైరక్షన్ లో సినిమా అని. అది కూడా పక్కకు వెళ్లిపోయినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే రానా ఏ పని చేసినా ఓకె అంటారేమో కానీ, నిర్మాత గా అంటే తండ్రి సురేష్ బాబు అంత త్వరగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

మరోపక్క జనవరి 10 కూడా దాటిపోయింది. అఖిల్ నుంచి ఏ మాటా బయటకు రాలేదు. ఇంతకీ తెలుస్తున్న విషయం ఏమిటంటే, అఖిల్ వీర బిజీగా వున్నారట. కథలు వింటున్నారట. ఒక్క కథ కూడా సరిగ్గా సెట్ కావడం లేదు.

అఖిల్ కు నచ్చిన కథ దొరకాలి. అదెప్పుడు దొరుకుతుందో? దొరికినా ? ఏ ఒక్క డైరక్టర్ కూడా ఖాళీ లేరు. అఖిల్ తరువాత తన దగ్గరకు వచ్చిన డైరక్టర్లు ఎవ్వరూ నచ్చలేదు అఖిల్ కు. ఇప్పుడు వాళ్లంతా ఫుల్ బిజీ అయిపోయారు. అఖిల్ ఖాళీగా వున్నారు.