విక్రమ్ కే కుమార్ మనకు వున్న మంచి డైరక్టర్లలో ఒకరు. అందులో సందేహం లేదు. ఆయన అందించగలిగిన టిపికల్ స్క్రీన్ ప్లే అన్నది మరెవరికీ సాధ్యం కాదు. అయితే సమస్య అల్లా, ఆయన ఓ సినిమాను శిల్పంలా తీర్చి దిద్దుతారు. బిజినెస్ పరంగా ఇది కాస్త సమస్య. పైగా ఆయన టెక్నికల్ టీమ్ కూడా ఓ రేంజ్ లో వుంటుంది. ఇవన్నీ కలిసి ఖర్చును పెంచుతాయి. ఇష్క్, మనం బాగానే గట్టెక్కేసాయి. కానీ 24 సినిమా బయ్యర్లకు అంతా ప్రాఫిటబుల్ కాలేకపోయింది.
ఇప్పుడు విక్రమ్ కుమార్ లేటెస్ట్ సినిమాకు కూడా నలభై కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ టైమ్ విక్రమ్ కుమార్ యాక్షన్ జోనర్ ను టచ్ చేస్తున్నారు. ఆయన చేసిన జోనర్ కాకుండా వేరే జోనర్ చేయడం అలవాటు. అందుకే ఈసారి హాలీవుడ్ యాక్షన్ టైప్ జోనర్ తీసుకుంటున్నట్లు వినికిడి. అఖిల్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లకే దాదాపు 20 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారట.
అఖిల్ తొలి సినిమా కూడా నలభై కోట్ల బడ్జెట్ తో తయారు చేసారు. రెండవది అదే రేంజ్ లో వెళ్లడం విశేషం. విక్రమ్ కుమార్ స్టామినా ఆయనకు వున్న పేరు చూసి నాగ్ ధైర్యం చేస్తున్నట్లుంది.