సినిమా ఓపెనింగ్ కు మంచిరోజు చూస్తారు. సెట్స్ పైకి వెళ్లడానికి ముహూర్తం చూస్తారు. కానీ హీరోయిన్ పేరును ప్రకటించడానికి కూడా ఇక్కడ ముహూర్తం చూస్తున్నారు. అవును.. అఖిల్ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని మీడియాకు చెప్పేందుకు మంచిరోజు కూడా వెయిట్ చేస్తున్నారు మేకర్స్.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఇందులో ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఎవరూ సెట్ కాలేదు. సో.. ఎప్పట్లానే అఖిల్ సరసన ఓ కొత్తమ్మాయిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఆ మేరకు ఓ అమ్మాయిని ఫైనలైజ్ చేశారు కూడా. కానీ ఆ అమ్మాయి పేరును ప్రకటించేందుకు మంచి ముహూర్తం సెట్ అవ్వడం లేదంట.
కేవలం హీరోయిన్ ఫైనల్ అవ్వలేదనే కారణంతోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆలస్యమైంది. చివరికి హీరోయిన్ ఎవరనే విషయం తేలకుండానే ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభించారు. కేవలం అఖిల్ పై, మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులపై కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించిన తర్వాత రెండో షెడ్యూల్ మొదలవుతుంది.
ఇటు అఖిల్, అటు బొమ్మరిల్లు భాస్కర్ ఇద్దరికీ ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. వీళ్లిద్దరూ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. ఈ సినిమా ఫెయిల్ అయితే అఖిల్ కు ఇంకో ఛాన్స్ వస్తుందేమో కానీ, బొమ్మరిల్లు భాస్కర్ మాత్రం ఇంటికెళ్లిపోవడం ఖాయం.
జగన్ ఐఏఎస్ మీటింగులో 'రిసీట్' అనే బదులు 'రిసీప్ట్' అన్నాడు..