Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్ కు కథ చెప్పాలని పూరి యత్నాలు

అఖిల్ కు కథ చెప్పాలని పూరి యత్నాలు

హిట్ వస్తే మన ఫోన్ బిజీ వుంటుంది. ఫ్లాప్ వస్తే, అవతలి వాళ్ల నుంచి నో ఆన్సర్ వినిపిస్తుంది. ఇది టాలీవుడ్ లో సహజం. ఎన్నో హిట్ లు ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్ టైమ్  ఇప్పుడు అంత బాలేదు. లోఫర్ తో సెట్ అవుతుందేమో అనుకున్నారు కానీ, కాలేదు.సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్లు కుమ్మేయ లేదు. సినిమా ఖర్చు ఇరవై కోట్లకు పై మాటే. కానీ వసూళ్లు అందులో సగానికన్నా వుంటాయా అని అనుమానపడుతున్నారు. 

లోఫర్ కు మంచి సూపర్ టాక్ వచ్చివుంటే అఖిల్ నుంచే పూరికి కబురు వచ్చివుండేది.కానీ అలా జరగలేదు. అందుకే ఇప్పుడు వ్యవహారం ఇట్నుంచి ప్రారంభమైంది. పూరీనే అఖిల్ ను కలవాలని చూస్తున్నాడు.కలిసి లైన్ చెప్పాలని అనుకుంటున్నారు. అయితే అలా నేరుగా తనంతట తాను ఎలా కలుస్తా అంటాడు.. ఎంతయినా టాప్ డైరక్టర్లలో ఒకడుకదా.. అందుకే వేరే రూట్ లో ట్రయ్ చేస్తున్నట్లు వినికిడి. కానీ అఖిల్ ఊ అంటాడా అన్నదే కాస్త అనుమానంగా వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?