అఖిల్‌ సినిమా హక్కుల రేట్లు ఆకాశంలో…!

హీరోను బట్టి కాంబినేషన్‌ను బట్టి.. వాటి డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను సాధ్యమైనంత ఎక్కువ ధరకు అమ్ముకుని టేబుల్‌ ప్రాఫిట్‌తో లాభపడిపోవాలనే.. నిర్మాత ఎప్పుడూ ఆరాటపడుతుంటాడు. అయితే కొందరు తాము పెట్టిన ఖర్చును లెక్కచూసుకుని.. దానికి ఒక…

హీరోను బట్టి కాంబినేషన్‌ను బట్టి.. వాటి డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను సాధ్యమైనంత ఎక్కువ ధరకు అమ్ముకుని టేబుల్‌ ప్రాఫిట్‌తో లాభపడిపోవాలనే.. నిర్మాత ఎప్పుడూ ఆరాటపడుతుంటాడు. అయితే కొందరు తాము పెట్టిన ఖర్చును లెక్కచూసుకుని.. దానికి ఒక రేంజిలో లాభాలు ప్లాన్‌ చేసుకుని.. ఆ ధర వద్ద అమ్మేస్తుంటారు. కానీ.. అలాంటి ఈక్వేషన్లు ఏమీ లేకుండా… కేవలం కాంబినేషన్‌ క్రేజీగా ఉన్నది కదాని.. రేట్లను ఆకాశంలోపెట్టేసి.. అమ్మేసి లాభపడిపోవాలనుకోవడం కొత్త ట్రెండేమో. 

ప్రస్తుతం అక్కినేని అఖిల్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో తెరంగేట్రం చేస్తున్న సినిమా డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు చాలా ఎక్కువ ధరలు చెబుతున్నారని పరిశ్రమలో గుసగుసలాడుకుంటున్నారు. అక్కినేని నాగార్జున, ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ పరంగా.. హీరోకు క్రేజ్‌ ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. అనూహ్యమైన రేంజిలో.. విపరీతమైన రేట్లకు అమ్ముతున్నారని.. చెప్పుకుంటున్నారు. 

ఫరెగ్జాంపుల్‌ ఒక జిల్లాలో అఖిల్‌ సినిమా 2.25 కోట్లనుంచి 2.5 కోట్ల వరకు ధరపెట్టి కొంటే.. ప్రాజెక్ట్‌ కాస్త సేఫ్‌గా ఉంటుందని ఇండస్ట్రీలో ఒక అంచనా ఉండేట్లయితే.. అలాంటి ధరకంటే ఏకంగా కోటి రూపాయలు పెంచి చెబుతున్నారుట. 3.25 కోట్ల కంటె తగ్గేది లేదని అంటూ చివరికి చర్చోచపర్చలు ఇతరత్రా ఒప్పందాలను బట్టి.. 2.90 కోట్ల వరకు అమ్మేస్తున్నారట. 

అక్కినేని నాగార్జున అమల ల కొడుకుగా ఇటీవలి కాలంలో యాడ్‌ లద్వారా కూడా కొంత యూత్‌క్రేజ్‌ సంపాదించుకున్న అఖిల్‌.. డెబ్యూసినిమాగా వస్తున్నందునే.. ఆ ప్రాజెక్ట్‌కు ఇంత క్రేజ్‌ ఏర్పడింది. పైగా వినాయక్‌ దర్శకత్వం కూడా ప్లస్‌పాయింటే. నిర్మాత నితిన్‌ నాన్న, సుధాకర్‌రెడ్డి.. భారీ రేట్లకు సినిమా హక్కులు అముతున్నారని తెలుస్తోంది. అయినా తన సినిమాకు రేటు నిర్ణయించుకోవడం నిర్మాత ఇష్టమే. నచ్చిన వాళ్లు కొనొచ్చు లేకుంటే లేదు. నిజమే గానీ.. ఇంత ధరలు పెట్టినా కొంటున్న వాళ్లు, రిజల్టు ఏ కొంచెం తేడా వచ్చినా పుట్టి మునుగుతుందని భయపడుతున్నారట.