అక్కినేని ఫ్యామిలీకి అరవై కోట్ల మార్కెట్ ను తొలి సినిమాతోనే సాధించి పెట్టాడు అఖిల్. అక్టోబర్ 21న ఆ సినిమా విడుదల కాబోతోంది. అంటే అఖిల్ తొలి సినిమా ఫినిష్ చేసేసినట్లే. అందుకే ఇప్పుడు రెండో సినిమాపై కబుర్లు ప్రారంభమయ్యాయి.
అఖిల్ రెండో సినిమా తాను చేస్తానని దర్శకుడు పూరి జగన్నాధ్ ముందుకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఆయన నేరుగా కబురు పంపాడా, లేదా వేరే వారి ద్వారానా అన్నది తెలియరాలేదు. పూరి దర్శకత్వంలో అఖిల్ తో తాను సినిమా నిర్మిస్తానని నిర్మాత బండ్ల గణేష్ ప్రపోజ్ చేసినట్లు కూడా వినికిడి.
అయితే ప్రస్తుతం అఖిల్, పూరి ఇద్దరూ కాస్త బిజీగానే వున్నారు. వాళ్లు ఖాళీ అయితే డిస్కషన్లు ప్రారంభం కావచ్చు. ఈ వైనం చాలా స్పష్టంగా తెలిసింది కాబట్టే, పూరి గురువు వర్మ ట్విట్టర్ లో అఖిల్ ను గాలిలోకి ఎత్తేస్తూ ట్వీట్ చేసినట్లు టాలీవుడ్ టాక్.