అఖిల్-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో సినిమా కన్ ఫర్మ్ అయింది. మరో ఒకటి రెండు నెలల్లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. స్క్రిప్ట్ రెడీ. కానీ డైలాగ్ వెర్షన్ తయారు కావాలి. రైటర్ హర్షవర్దన్ వేరే సినిమా మీద వుండడం వల్ల కాస్త వెయిటింగ్. అతగాడు ఫ్రీ కాగానే డైలాగ్ వర్క్ ప్రారంభమవుతుంది. ఎప్పుడూ కాస్త క్లిష్టమైన సబ్జెక్ఠ్ లు సినిమాలుగా మార్చే విక్రమ్ కుమార్ ఈ సారి కూడా అలాంటి వ్యవహారామే తలకెత్తుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు ప్రత్యేకంగా మీ కోసం.
చిన్నప్పుడే హీరో హీరోయిన్లు ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి మారిపోతారు. పైగా హిందూ కుటుంబం నుంచి ముస్లిం కుటుంబానికి. అనుకోకుండా ఇద్దరు ప్రేమలో పడతారు. అంటే ఇద్దరూ తన కుటుంబానికే తను మళ్లీ వేరే రిలేషన్ తో చేరడం అన్నమాట. అంటే ఉదాహరణకు అమ్మాయి తన ఇంటికే తను కోడలిగా వెళ్లడం..అబ్బాయి తన ఇంటికే తను అల్లుడిగా వెళ్లడం..ఇలా అన్నమాట.
పైగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమిటంటే, ఈ విషయం వారి వారి అమ్మలకు మాత్రం తెలిస్తుంది. విక్రమ్ కుమార్ ఘటికుడు. ఎప్పుడూ ఇలాంటి క్లిష్టమైన సబ్జెక్ట్ లే తలకెత్తుకుంటాడు. శభాష్ అనిపించుకుంటాడు. స్టోరీ లైన్ ఇంటెరిస్టింగ్ గానే వుంది. అఖిల్ కు మంచి లైన్ నే దొరికింది. మూడో సినిమా దర్శకుడు మారుతితో వుంటుంది. అది కూడా మంచి లైన్ నే. ఆ కథ గురించి మరోసారి ముచ్చటించుకుందాం.