అక్కినేని అఖిల్ పెళ్లి క్యాన్సిల్?

వ్యక్తుల వ్యక్తిగత విషయాలు మీడియాకు అనవసరం అంటారు కానీ, మహా కవి శ్రీశ్రీ చెప్పిన దాని ప్రకారం పబ్లిక్ ఫిగర్లకు ఈ సమస్య తప్పదు. అందునా సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు అభిమానులకు, పాఠకులకు…

వ్యక్తుల వ్యక్తిగత విషయాలు మీడియాకు అనవసరం అంటారు కానీ, మహా కవి శ్రీశ్రీ చెప్పిన దాని ప్రకారం పబ్లిక్ ఫిగర్లకు ఈ సమస్య తప్పదు. అందునా సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు అభిమానులకు, పాఠకులకు అత్యంత ఇష్టమైన వ్యవహారాలు. అందుకే అక్కినేని అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయిందన్న వదంతిని చెప్పక తప్పడం లేదు.

కొద్ది రోజుల క్రితమే జివికే ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీకి మధ్య వియ్యం కుదరింది. జివికె మనవరాలిని అక్కినేని అఖిల్ ప్రేమించడంతో వారిద్దరి పెళ్లికి పెద్దలు పచ్చజెండా ఊపారు. వైభవంగా ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు మరేమయిందో కానీ, మళ్లీ మరోసారి ఇరువర్గాలు సమావేశమై, ప్రశాంతంగా చర్చించుకుని, పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు పక్కా సమాచారంతో తెలుస్తోంది. అయితే సమస్య ఫ్యామిలీల మధ్య కాదని, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు నడుమే అని తెలియవస్తోంది. పెళ్లయిన తరువాత ఇబ్బందులు పడేకన్నా, ముందే ఇలా కావడం బెటర్ అనే ఆలోచనతో ఇరు వర్గాలు పెళ్లి వ్యవహారాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి ఈ పెళ్లిని రోమ్ లో చేయాలనుకున్నారు. దానికి ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. సుమారు 50 మంది వరకు రోమ్ వెళ్లడానికి సన్నాహాలు కూడా చేసారు. కానీ ఇంతలో ఇలా జరగింది. జివికే ఫ్యామిలీతో నాగ్ ఫ్యామిలీకి చిరకాల స్నేహ సంబంధాలు వున్నాయి. అవి మరింత దెబ్బ తినకూడదని, రెండు కుటుంబాలు సమావేశమై, చర్చించుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.