Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'అల' హిందీ డిజిటల్,శాటిలైట్ @ 19.50 కోట్లు

'అల' హిందీ డిజిటల్,శాటిలైట్ @ 19.50 కోట్లు

త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో తయారవుతున్న అల వైకుంఠపురములో సినిమా హిందీ బిజినెస్ దాదాపు క్లోజ్ అయినట్లే..19.50 కోట్ల కు హిందీ శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ హక్కులు ఇచ్చేయడానికి ఒప్పందం కుదిరినట్లు బోగట్టా. వాస్తవానికి హారిక హాసిని సంస్థ 22 కోట్లు కావాలని కోరింది. 

హిందీ మార్కెట్ పడిపోవడానికి పూర్వం ఈ మేరకు వచ్చేలాగే కనిపించింది. కానీ ఇప్పుడు మార్కెట్ పడిపోవడంతో, రెండున్నర కోట్లు తగ్గిపోయింది.

బన్నీ సినిమాలకు హిందీ డిజిటల్ లో మంచి మార్కెట్ వుంది. అందుకే మంచి రేటు పలికింది. గతంలో వచ్చిన సరైనోడు వగైరా సినిమాలు హిందీ డిజిటల్ కొనుగోలు దారులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.

ఇప్పటికే అలవైకుంఠపురంలో రెండు పాటలు బాగా వైరల్ అయ్యాయి. దీని ఫ్రభావం కూడా హిందీ మార్కెట్ లో కాస్త మంచి అమౌంట్ రావడానికి ఉపయోగపడినట్లు బోగట్టా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?