‘అల’ టీజర్ ముస్తాబవుతోంది

టాలీవుడ్ సంక్రాంతి పుంజులు 'సరిలేరు నీకెవ్వరూ', 'అల వైకుంఠపురములో'. ఈ మధ్యనే సరిలేరు నీకెవ్వరూ టీజర్ బయటకు వచ్చింది. గత రికార్డులు బద్దలు కొడుతూ యూ ట్యూబ్ లో 20 మిలియన్ల వ్యూస్ రాబట్టింది.…

టాలీవుడ్ సంక్రాంతి పుంజులు 'సరిలేరు నీకెవ్వరూ', 'అల వైకుంఠపురములో'. ఈ మధ్యనే సరిలేరు నీకెవ్వరూ టీజర్ బయటకు వచ్చింది. గత రికార్డులు బద్దలు కొడుతూ యూ ట్యూబ్ లో 20 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఇక ఇప్పుడు బన్నీ వంతు. అల వైకుంఠపురములో సినిమా టీజర్ రాబోతున్నట్లు బోగట్టా. వాస్తవానికి ముందు అయితే ఇక టీజర్ అవసరం లేదని భావించినట్లు బోగట్టా. 

ఎందుకంటే రెండు పాటలు వదిలారు. అంతకు ముందు చిన్న చిన్న టీజర్లలాంటి విడియోలు వదిలారు. ఇక అందువల్ల టీజర్ అవసరమా? అన్న ఆలోచన చేసారు. కానీ ఎప్పడయితే సరిలేరు నీకెవ్వరూ టీజర్ రావడం, హడావుడి చేయడంతో, ఇప్పుడు 'అల వైకుంటపురములో' సినిమా కూడా టీజర్ కట్ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే మరీ 'అల' టీజర్ నిడివి నిమిషం లోపే వుండవచ్చుని తెలుస్తోంది. సరిలేరు టీజర్ నిమిషం మీదా 26సెకెండ్లు నిడివి వచ్చింది. అయితే అల టీజర్ మాత్రం 60 సెకెండ్లకన్నా తక్కువే వుండే అవకాశం వుంది. ఎలాగూ మరో నెల రోజుల్లోపే ట్రయిలర్ వచ్చే అవకాశం వుంది. అందువల్ల టీజర్ వీలయినంత చిన్నదే వుండాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నారట.

అల ట్రయిలర్ డిసెంబర్ 20 నుంచి 25 మధ్యలో విడుదలయ్యే అవకాశం వుంది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ లు జరుగుతున్న ఈ సినిమాకు ఒకటిన్నర పాట బ్యాలన్స్ వుంది. పాటల వర్క్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తారు.