Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అలవాటు పడుతున్న కరోనా కల్లోలం

అలవాటు పడుతున్న కరోనా కల్లోలం

మొత్తానికి జనజీవనం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. ఇళ్లలో వుండడానికి జనం ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. సరుకుల మీద ఆందోళన తగ్గుతోంది. చాలా చోట్ల కూరగాయలు, పాలు లాంటి నిత్యావసర వస్తువుల కోసం ఎగబడడం తగ్గుతోంది. ఇళ్లలో సరిపడా స్టాక్ పెట్టుకున్నందున జనాల తాకిడ తగ్గుతోంది. పెట్రోలు బంకులు దాదాపు ఖాళీగానే వుంటున్నాయి. వాహనాలు తిరగక పోవడం, అయినా అందరూ సరిపడా పెట్రోలు ను ఇప్పటికే కొనుగోలు చేయడం వంటి వాటి వల్ల బంకులు అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.

పోలీసు దెబ్బలు వాట్సాప్ లో మారు మోగడం వల్ల కావచ్చు, పోలీసులు కూడా పరస్థితిని కంట్రోలు చేయడం వల్ల కావచ్చు. ఇక ఆ తరహా హడావుడి కూడా కనిపించడం లేదు. ఆంధ్రలోని చిన్నచిన్న పల్లెల్లో సోషల్ డిస్టాన్స్ పాటిస్తూనే పొలం పనులు కూడా మెల్లగా అమలు జరుగుతున్నాయి. 

అధికారులు, పోలీసులకు ఓ ఐడియా అంటూ వచ్చింది. ఓ రోటీన్ అంటూ ఏర్పడింది. మొత్తం మీద వ్యవహారం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. జనాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కల్లోలం చూసి, కరోనా మీద జోకులు ఆపి సీరియస్ నెస్ కు అలవాటు పడుతున్నారు. దీంతో ప్రభుత్వాల పని కాస్త సులవు అవుతోంది.

ఇక ఇప్పుడు మిగిలింది కామన్ మాన్ ను కష్టాల నుంచి ఆదుకోవడమే. ప్రభుత్వం ఎలాగూ రేషన్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం చేస్తామంటోంది. ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ, ఏ సంస్థకు ఆ సంస్థ తమ తమ వర్కర్లను ఆదుకోవడానికి ఏవో ఒకటి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల వరకు జీతాల సమస్య రాదు. మే ఫస్ట్ సంగతి చూసుకోవాలి. 

అన్నింటికి మించి రిజర్వ్ బ్యాంక్ ఇఎఎమ్ఐ లను మూడు నెలలు వాయిదా వేయడం అన్నది దాదాపు 90శాతం మందికి తీపి కబురుగా మారింది. వేతన జీవులకు గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపేసినట్లు అయింది.  పట్టణాల్లో ఇదే పెద్ద సమస్య. అది కూడా తీరింది. ఇక మిగిలింది వైన్ షాపులు ఒక్కటే. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనీసం సగం మంది సమస్య అదే.

అయితే వైన్ షాపులు తెరించేందుకు అనుమతి ఇస్తే అది జనాల ట్రోలింగ్ కు దారితీస్తుంది అని ప్రభుత్వాలు ఈ విషయంలో సోచాయిస్తున్నాయి. వైన్ దుకాణాలు కూడా తెరిచారంటే రోడ్ల మీద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం వుంది. మరో రెండు రోజుల పాటు కొత్త కేసులు రాకుండా, కరోనా భయం తగ్గుతోంది అన్న ఫీల్ ఒక్కటి రావాల్సి వుంది. అదే కనుక జరిగితే ఏప్రియల్ 14 వరకు లాక్ డౌన్ అన్నది స్మూత్ గా సాగిపోతుంది.

ఇంట్లో నేతి దీపాలు వెలిగించాలా?

మేము సైతం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?