ఏ సినిమాకైనా పబ్లిసిటీ కీలకం. చిన్న సినిమాలు సైతం వీర పబ్లిసిటీతో కుమ్మేస్తున్నాయ్. కానీ పాపం తన సినిమాలకు సరైన పబ్లిసిటీ చేయడం లేదని అల్లరి నరేష్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తన సినిమాకు సరైన పబ్లిసిటీ ఇవ్వడం లేదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇకపై ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ తో సినిమా అల్లరి నరేష్ సినిమా చేయకపోవచ్చని వినికిడి.
గతంలో జేమ్స్ బాండ్ సినిమాకు కూడా సరైన పబ్లిసిటీ చేయలేదని అల్లరి నరేష్ ఫీలయ్యాడట. ఇప్పుడు చేస్తున్న సెల్ఫీ రాజాకు కూడా పబ్లిసిటీ నీరసంగా వుందని తన సన్నిహితులతో అంటున్నట్లు తెలుస్తోంది. అందుకే తనకు తానే ఊళ్లు తిరుగుతూ పెద్దగా ఖర్చు లేని పబ్లిసిటీ కానిచ్చేస్తున్నాడు. నిర్మాత అనిల్ సుంకర్ అమెరికాలో వున్నారు. సినిమా విడుదల మాత్రం మరోవారంలో వుంది.
దాదాపు అన్ని సినిమాలకు కనీసం కోటి రూపాయిలు పబ్లిసిటీ బడ్జెట్ పెడుతుంటే, ఎకె సంస్థ తన సినిమాలకు అందులో సగం కూడా పెట్టడం లేదని, అందుకే ఇకపై ఆ సంస్థలో సినిమా చేయాలన్న ఆలోచనం అల్లరి నరేష్ కు లేదని ఆయన సన్నిహిత వర్గాల బోగట్టా. చేయబోయే సినిమా సంగతి దేవుడెరుగు? మరి పాపం, ఈ సెల్ఫీ రాజాకు, సెల్ఫ్ పబ్లిసిటీ తోనే సరిపెడతారేమో?