Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ మెగా హీరో ప్లే బాయ్ లైఫ్ అనుభవిస్తున్నాడా?

ఈ మెగా హీరో ప్లే బాయ్ లైఫ్ అనుభవిస్తున్నాడా?

అల్లు శిరీష్.. హీరోగా తన ప్రయత్నాల్లో తానున్నాడు. ఈయన హీరోగా అవతారం ఎత్తినప్పుడు చాలా విమర్శలే వచ్చాయి కానీ.. చూడగా, చూడగా.. శిరీష్ కూడా హీరోగా సెటిలయ్యేలానే ఉన్నాడు.

శ్రీరస్తు.. శుభమస్తు వంటి సినిమాతో ఫర్వాలేదనిపించుకోవడంతో ఇక పూర్తి స్థాయిలో హీరోగా సెటిలయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడితను. ఈ క్రమంలో అల్లు శిరీష్ చేసిన కామెంట్లు ఆసక్తిని రేపుతున్నాయి. పెళ్లి విషయంలో అభిమానులు ఎవరో ఒక ప్రశ్న అడుగగా.. అసలు పెళ్లి ఎందుకు బాసు? అని ప్రశ్నించాడు ఈ హీరో.

అంతటితో ఆగక.. రొమాన్స్ కోసమే అయితే పెళ్లి అవసరం లేదు, రిలేషన్ షిప్ చాలు అని ఈ హీరో చెప్పుకొచ్చాడు! మరి పెళ్లి ఆలోచన ఇప్పుడప్పుడే లేదని చెప్పడం ఒక రకం. కానీ అల్లు శిరీష్ అంతటితో ఆగడం లేదు. రొమాన్స్ కోసమే అయితే పెళ్లి అవసరమే లేదని అంటున్నాడు, రిలేషన్ షిప్ చాలని చెప్పుకొచ్చాడు.

మరి తను రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పుకోవడమే ఈ హీరో మాటల అంతరార్థమేమో అనే అభిప్రాయాలు కలుగుతున్నాయిప్పుడు. సూటిగా చెప్పకుండా పరోక్షంగా చెబుతున్నాడేమో. తను ప్లే బాయ్ లైఫ్ ను అనుభవిస్తున్నాననే సంకేతాలను ఇస్తున్నాడు ఈ హీరో.

రొమాన్స్ కోసమే అయితే పెళ్లి అవసరం లేదు అని అంటున్న ఈ హీరో ఏ రిలేషన్ షిప్ లో ఉన్నాడో అనేది మాత్రం చెప్పలేదు. రిలేషన్ షిప్ తోనే రొమాన్స్ ను పొందవచ్చని చెబుతున్న ఈ హీరో ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నాడో మరి. అల్లు శిరీష్ రిలేషన్ షిప్స్ గురించి మీడియాలో అయితే ఇప్పుడు గాసిప్స్ ఏమీ లేవు. తన మాటలతో అలాంటి గాసిప్పులు వచ్చేలా చూసుకుంటున్నాడితను. అసలు కథేంటో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?