ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సామాజిక మాధ్యమాల్లో టిక్ టాక్ ఒకటి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు, పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు టిక్ టాక్ విడియోలు చేయడంలో తమ సృజన చూపిస్తున్నవారు ఎందరో వున్నారు. అలాంటి విడియోలను చూసేవారు అంతకన్నా ఎక్కువ మంది వున్నారు.
ఫేస్ బుక్ కన్నా ఇప్పుడు టిక్ టాక్ పాపులర్ అయిపోతోంది. పైగా అశ్లీల కంటెంట్ ను ఆపడంలో టిక్ టాక్ చాలా గట్టిగా వ్యవహారిస్తోంది. అందువల్ల క్లాస్ జనాలు కూడా టిక్ టాక్ ను ఫాలో అవుతున్నారు.
ఇండస్ట్రీలో కింగ్ పిన్ అని చెప్పుకోదగ్గ పెద్దాయిన అల్లు అరవింద్ కూడా టిక్ టాక్ ఫ్యాన్ అంట. ఆయన కూడా రోజులో ఒకసారి అయినా టిక్ టాక్ ను చూస్తుంటారట.
రిలాక్స్ కావడానికి, ఇండస్ట్రీ సినిమాలకు సంబంధించిన కంటెంట్ కు వస్తున్న రియాక్షన్ ను గమనించేందుకు అరవింద్ టిక్ టాక్ చూస్తుంటారని తెలుస్తోంది.
ఇటీవల ఆయన తన తనయుడు బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమాలోని పాటలకు టిక్ టాక్ లో వస్తున్న రెస్పాన్స్ కూడా గమనించి, యంగ్ జనరేషన్ లో ఇంత టాలెంట్ వుందా అని సన్నిహితుల దగ్గర కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.