బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవడానికి సినీ ఇండస్ట్రీలో ఆట్టే సమయం పట్టదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది చాలా ఫాస్టుగా జరిగిపోతుంది. ఒక రెండు ఫ్లాపులు పడితే ఎంత స్టార్ హీరోయిన్ రేంజ్ అయినా అమాంతం పడిపోతుంది. నిన్న మొన్నటివరకు సమంత ఉంటే సినిమాకి వేల్యూ యాడ్ అవుతుందని అనుకున్న వాళ్లే ఇప్పుడు ఆమె వల్ల ఎలాంటి క్రేజ్ యాడ్ అవదని అనేస్తున్నారు.
రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రాబోతున్న ‘నా పేరే రాజు’ సినిమాలో సమంతకి బదులుగా రకుల్ ప్రీత్ సింగ్‌కి ఛాన్స్ ఇచ్చారని వినిపిస్తోన్న నేపథ్యంలో సమంత టాలీవుడ్ కెరీర్‌కి మంగళం పాడేసారని అర్థమవుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్‌తో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో సమంత నటిస్తోంది. ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు చిత్రమిది.
దీనిపైనే సమంత ఆశలన్నీ పెట్టుకుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అయి తిరిగి తనని డిమాండ్‌లోకి తెస్తుందని సమంత ఎక్స్‌పెక్ట్ చేస్తోంది. అయితే ఇదే హీరో, డైరెక్టర్ కాంబినేషన్‌లో హిట్ కొట్టిన ఇలియానాకి తెలుగులో ‘జులాయి’ లాస్ట్ ఫిలిం అయింది. ఈ విషయం కానీ సమంత తెలుసుకుంటే ఎంత వర్రీ అయిపోతుందో పాపం