అన్నిరంగాల్లో విజయవంతమైన టాలీవుడ్ ప్రముఖుడు అల్లు అరవింద్ కు ఒక్కటే సమస్య. అల్లుశిరీష్ ను హీరోగా నిలబెట్టాలన్నదే ఆ సమస్య. కానీ జనం మాత్రం పాజిటివ్ గా స్పందించడం లేదు. మధుర శ్రీధర్ ఓ సినిమా అల్లుశిరీష్ తో సినిమా తీసి దారుణంగా దెబ్బతిన్నారు. ఆ తరువాత మళ్లీ సినిమా రాలేదు.
అందుకే అల్లు అరవింద్ సరైన ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు బోగట్టా. ఇటీవలే రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు రమేష్ వర్మను పిలిచి, మాంచి రీమేక్ దొరికితే అల్లుశిరీష్ చేద్దాం అని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా అతి తక్కువ బడ్జెట్ తో కొత్తవాళ్లతో సినిమాలు తీసి, హిట్ కొట్టే నిర్మాత బెక్కం వేణుగోపాల్ ను కూడా ఓ ప్రాజెక్టు చేయమని అల్లు అరవింద్ కోరినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ-అఖిల్ సినిమాలతో గీతాసంస్థ బిజీగా వుంది. అందువల్ల శిరీష్ తో సినిమా చేసే పరిస్థితి వున్నట్లు లేదు. అందుకే వేరే చిన్న నిర్మాతలకు, దర్శకులకు ఆ పని అప్పగించాలని చూస్తున్నట్ల కనిపిస్తోంది.