Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆమె జీవితంలో అసలైన మగాడు.!

ఆమె జీవితంలో అసలైన మగాడు.!

బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌, పలువురు యంగ్‌ హీరోలతో ఎఫైర్స్‌ కొనసాగిస్తోందంటూ చాలాకాలంగా గాసిప్స్‌ విన్పిస్తోన్న విషయం విదితమే. అయితే, ఆ గాసిప్స్‌ని ఆమె ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. 'నాన్సెన్స్‌, ఫ్రెండ్సిప్‌కీ ఎఫైర్‌కీ తేడా తెలియదా.?' అంటూ నిన్న మొన్నటిదాకా గుస్సా అయిన అలియా, ఇప్పుడు తన మనసులో కొత్త కొత్త భావాలేవో కలుగుతున్నాయంటూ అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. 

'నేనూ అమ్మాయినే కదా.. నా మనసు ప్రేమను కోరుకుంటోంది.. జీవితంలో అసలైన మగాడు దొరికితే ఇలానే వుంటుందేమో..' అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరు జారేసింది. అసలైన మగాడు.. అంటే.? అన్న ప్రశ్నకు, నా భావాల్ని గౌరవించేవాడు, నన్ను సంతోషంగా వుంచేవాడని సమాధానమిచ్చింది అలియా భట్‌. అఫ్‌కోర్స్‌, అతను నా స్నేహితుడే, ఇంకా లవ్‌ అనే ఆలోచన కలగలేదు.. అంటూ కవరింగ్‌ కూడా ఇచ్చేసింది. 

వయసు తక్కువే అయినా, అలియా మహా ముదురు. ఎంతైనా భట్‌ ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా, ఆ మాత్రం లౌక్యం అలియా భట్‌కి వుండడంలో తప్పేమీ లేదు. అయితే ఇదంతా, అలియా తన తాజా చిత్రం ప్రమోషన్‌ కోసం ఆడుతున్న పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమేనని బాలీవుడ్‌ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఏమో, ఏది నిజమోగానీ అలియా భట్‌ మనసులో ఆ అసలైన మగాడి వేటలో బాలీవుడ్‌ మీడియా బిజీ బిజీగా వుందిప్పుడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?