అమ్మో..రోబో 2 తెెలుగు రేటు అంతా?

శంకర్ – రజనీ కాంబోలో తయారవుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఏదో మీడియాలో హడావుడి తప్పిస్తే, మరీ అంత అద్భుతమైన హైప్ ఏమీ వచ్చి పడిపోలేదు. ఈ…

శంకర్ – రజనీ కాంబోలో తయారవుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఏదో మీడియాలో హడావుడి తప్పిస్తే, మరీ అంత అద్భుతమైన హైప్ ఏమీ వచ్చి పడిపోలేదు. ఈ సినిమా తెలుగుబేరం సెటిల్ కావాల్సివుంది.

నేరుగా తెలుగు వెర్షన్ విడుదల చేసే ఉద్దేశం అయితే నిర్మాణ సంస్థ లైకా కు లేనట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ సినిమాను తెలుగులో ఎవరు కొంటారు అన్నది పాయింట్. ఇంత క్రేజీ ప్రాజెక్టును ఎందుకు కొనరు? బోలెడు మంది క్యూలో వున్నారు? హాట్ కేక్ లా ఎగరేసుకుపోతారు?  ఇలాంటి మాటలు కామనే. కానీ అసలు రేటు ఎంత అన్నది పాయింట్. దాన్ని బట్టే హాట్ కేకా? కాదా అన్నది.

కేవలం ఫస్ట్ లుక్ లాంచింగ్ కే ఆరు కోట్లు ఖర్చు చేసిన సినిమా ఇది. 350 cr బడ్జెట్ సినిమా అంటే మరి తెలుగు వెర్షన్ రేటు ఎంత వుంటుంది ?  అదే పెద్ద ప్రశ్న.

యాభై కోట్లు చెబుతారా? అంతకన్నా ఎక్కువ వుంటుందా? రజనీ లింగా, కబాలి 30 cr దగ్గరలో అమ్మారు.  రెండు సినిమాలు కూడా బయ్యర్లను కాకుండా, ప్రొడ్యూసర్లను ముంచేసాయి. అలాగే శంకర్ ఐ సినిమా కూడా నలభై దగ్గర్లలో అమ్ముడుపోయి, డమాల్ అయింది.

ఇప్పుడు ఈ సినిమాను నలభై, యాభైకు ఇవ్వరని, చాలా ఎక్కువ రేటు వుంటుందని టాలీవుడ్ వర్గాల బోగట్టా.  మరి శంకర్ ను, రజనీని నమ్మి యాభై కోట్లకు పైగా ఎవరు రేట్ కోట్ చేసే సాహసం చేస్తారన్నది అనుమానం. కానీ మరోపక్క లైకా కంపెనీ తెలుగు రేటును 70 కోట్లకు పైగా అంచనాలు వేసుకుంటోందని వినికిడి. అలా అయితే ఆఖరికి వాళ్లే డైరెక్ట్ గా విడుదల చేసుకోవాల్సి వుంటుందేమో?