Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అమీ.. అది నిజమేనా.?

అమీ.. అది నిజమేనా.?

అమీ జాక్సన్‌.. ఈ బ్రిటిష్‌ బ్యూటీ ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై వెలిగిపోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సత్తా చాటుతోంది. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ సంగతి పక్కన పెడితే, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. అందాల ప్రదర్శనలో అమీకి పోటీ ఇచ్చేవారే లేరన్నది నిర్వివాదాంశం. ఆ సంగతి అలా వుంచితే, నటనలోనూ సినిమా సినిమాకీ పరిణతి సాధిస్తోందీ బ్యూటీ. 

శంకర్‌ 'ఐ' సినిమాకి ముందు పలు సినిమాల్లో నటించినా, 'ఐ' సినిమాతోనే అమీ జాక్సన్‌ పాపులారిటీ మరింత పెరిగింది. ఇప్పుడీ బ్యూటీ, శంకర్‌ దర్శకత్వంలోనే వస్తోన్న 'రోబో' సీక్వెల్‌ '2.0'తోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజా ఖబర్‌ ఏంటేంటే, ఈ బ్యూటీతో మరో సినిమాకి శంకర్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడట. అదేంటి.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. 

'ఐ' సినిమాలో అమీ జాక్సన్‌ని శంకర్‌ చాలా గ్లామరస్‌గా చూపించినా, అందులోని వికృతాకారాలు (విలన్లు, హీరో) పుణ్యమా అని, అమీ జాక్సన్‌ గ్లామర్‌ వృధా అయిపోయింది. ఆ సినిమా విడుదలయ్యాకే విక్రమ్‌, అమీ కాంబినేషన్‌లో మరో సినిమాకి శంకర్‌ ఫిక్సయ్యాడట. '2.0' తర్వాత విక్రమ్‌, అమీ కాంబినేషన్‌లో శంకర్‌ ఓ సినిమా పట్టాలెక్కించనున్నాడని తమిళ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?