త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే అందనంత ఎత్తున వుంటాయి అంచనాలు. ఇప్పుడు ఈ అంచనాలే 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాకు ప్రమాదంగా మారేలా కనిపిస్తున్నాయి. సాధారణంగా మణిశర్మ, కోటి దగ్గర నుంచి దేవీ, అనిరుధ్ వరకు ఎవరు సంగీతం అందించినా, పాటలు మాత్రం అద్భుతంగా వుండడం అన్నది కామన్.
అజ్ఞాతవాసి సినిమా ఎలా వున్నా, పాటల విషయంలో మరీ దారుణమైన కంప్లయింట్ అయితే లేదు. కానీ ఈ రోజు అరవింద సమేత వీర రాఘవ సాంగ్ మాత్రం త్రివిక్రమ్ మార్క్ కు కాస్త దూరంగా ఆగిపోయిందేమో? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. పాట లిరిక్స్ ఫరవాలేదు. ట్యూన్ మాత్రం జస్ట్ ఓకె అంటున్నారు విన్నవాళ్లు. విడియో మ్యాచ్ అయితే పాట తరువాత లెవెల్ కు వెళ్తుందేమో?
అయితే ఫ్యాన్స్ మాత్రం కొత్తగా వుందని, బావుందని, థమన్ సూపర్ అని పొంగిపోతున్నారు. లైకులు కొడుతున్నారు. ఫ్యాన్స్ కు నచ్చడమే కదా? కావాల్సింది. ఆ విధంగా పాట పాసై పోయినట్లే.
ఇదిలా వుంటే సాధారణంగా సినిమాలో ది బెస్ట్ అనుకున్నదాన్నే ముందుగా వదుల్తారు. అందువల్ల మిగిలిన పాటలు ఇంతకన్నా బెస్ట్ అనుకోవడానికి లేదేమో? అన్న అనుమానం వుంది. కానీ అది సరికాదంటున్నాయి యూనిట్ వర్గాలు. ఇంకా మంచి పాటలు వున్నాయని, మాంచి ఎమోషనల్ సాంగ్ ఒకటి వుందని అంటున్నారు. ఇవన్నీ వరుసగా వస్తాయని, టోటల్ గా ఆల్బమ్ సూపర్ అనిపించుకుంటుందని అంటున్నారు. చూడాలి. ముందు ఈ రిలీజ్ అయిన ఈ సాంగ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో?