రామ్ చరణ్ ఇప్పటికే తన బాక్సాఫీస్ పొటెన్షియల్ ఏమిటనేది నిరూపించుకున్నాడు. చాలా సాధారణ కంటెంట్ ఉన్న కమర్షియల్ కథలతో నలభై అయిదు కోట్లకి పైగా షేర్ మూడు సార్లు సాధించి మాస్ హీరోగా తనది తిరుగులేని ఇమేజ్ అని చరణ్ చాటుకున్నాడు. అయితే చరణ్ నటించిన రచ్చ, నాయక్, ఎవడు అన్నీ కూడా నైజామ్‌లో యావరేజ్‌గా ఆడాయి. ఓవర్సీస్‌లో ఫెయిలయ్యాయి.
చరణ్ చిత్రాలు మాస్‌ని అలరిస్తున్నా కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించలేకపోతున్నాయి. వరుసగా ఒకే తరహా చిత్రాలు చేయడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కి దూరమైన చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’తో అందరినీ మెప్పించాలని చూస్తున్నాడు. అయితే ఫామ్‌లో లేని కృష్ణవంశీతో చేయడం వల్ల ఈ చిత్రానికి పెద్దగా క్రేజ్ రాలేదు.
మంచి సీజన్‌లో రిలీజ్ కావడం, ఇటీవల వచ్చిన భారీ చిత్రాలన్నీ ఫ్లాప్ అవడం… గోవిందుడు అందరివాడేలేకి అడ్వాంటేజ్‌గా మారనున్నాయి. అయితే ఈ హాలిడే పీరియడ్‌ని మాగ్జిమమ్ క్యాష్ చేసుకోవడానికి డీసెంట్ టాక్ రాబట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో.. గోవిందుడి భవితవ్యం ఏమిటనేది రేపు ఉదయం వచ్చే టాక్ మీదే ఆధారపడి ఉంది.