అందరికీ డాడీ ఆయనే

కొన్నాళ్ల క్రితం చంద్రమోహన్, చలపతిరావు..ఇప్పుడు ఆ ప్లేస్ రాజేంద్ర ప్రసాద్ కు వచ్చింది. యంగ్ హీరోలందరికీ ఫాదర్ ఆయనే. మహేష్ బాబుకే అనుకుంటే, ఇప్పుడు అఖిల్ కు కూడా. వివి వినాయక్ డైరక్షన్లో, హీరో…

కొన్నాళ్ల క్రితం చంద్రమోహన్, చలపతిరావు..ఇప్పుడు ఆ ప్లేస్ రాజేంద్ర ప్రసాద్ కు వచ్చింది. యంగ్ హీరోలందరికీ ఫాదర్ ఆయనే. మహేష్ బాబుకే అనుకుంటే, ఇప్పుడు అఖిల్ కు కూడా. వివి వినాయక్ డైరక్షన్లో, హీరో నితిన్ నిర్మిస్తున్న సినిమాతో అక్కినేని అఖిల్ తెరగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమాలో అఖిల్ తండ్రి పాత్రకు నట కిరీటీనే ఫైనల్ చేసారట. రాజేంద్రుడి సెకండ్ ఇన్నింగ్స్ మాంచి జోరుగా సాగుతోంది. ఓ పక్క తండ్రి పాత్రలు, మరోపక్క టామీ, దాగుడుమూతల దండాకోర్ లాంటి సినిమాల్లో వెరైటీపాత్రలు వేస్తూ, మాంచి బిజీ అయిపోయాడు.