ఫ్యాషన్ డిజైనర్..ఏ ముహుర్తంలో ఈ పేరు పిక్సయిందో..అలా అలా జాప్యం అవుతూనే వస్తొంది. రవితేజ, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇలా ఒక్కొక్కరి దగ్గరకి వెళ్లి వస్తోంది. ఆఖరికి తాజాగా దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు, రానా సోదరుడు అభిరామ్ పేరు వినిపించింది. దర్శకుడు వంశీ కథ తయారుచేస్తున్నారు..వినిపిస్తారు.
సురేష్ బాబు అప్పుడు తన ఓపీనియన్ చెబుతారు అని ఇన్నాళ్లు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపించింది. అయితే లేటెస్ట్ ఖబర్ ఏమిటంటే, ఈ సినిమాకు కొత్తవాళ్లను తీసుకునే ఆలోచనలో ఫ్యాషన్ డిజైనర్ రూపకర్తలు వున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొద్ది రోజుల్లో ఓ కాస్టింగ్ కాల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
అంటే సీనియర్ డైరక్టర్ వంశీ, ప్యూర్ జూనియర్ నటులతో ఫ్యాషన్ డిజైనర్ ను రూపొందించే ఆలోచనలో వున్నారన్న మాట.అయితే హీరో గా అభిరామ్ ను తీసుకున్నా కొత్త నటుడి కిందే లెెక్క. మరి అభిరామ్ కాకుండా హీరో క్యారెక్టర్ కు కూడా కాస్టింగ్ కాల్ ఇస్తారో లేదో ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది.