Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనిల్ రావిపూడికి ఆ యూనిట్ లో సమస్య?

అనిల్ రావిపూడికి ఆ యూనిట్ లో సమస్య?

అనిల్ రావిపూడి సూపర్ హిట్ కొట్టారు దిల్ రాజు బ్యానర్ లో. రవితేజ కాంబినేషన్ లో రాజా ది గ్రేట్ సినిమా చేసారు. బోయపాటి తరువాత ఆ రేంజ్ మాస్ డైరక్టర్ అనిపించుకున్నారు. ఇప్పుడు మళ్లీ దిల్ రాజు బ్యానర్ లోనే ఎఫ్ 2 అనే మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో వెంకీ-వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా కనిపిస్తారని, వీరు తమ భార్య, లవర్ నుంచి తప్పించుకునేందుకు ఫారిన్ వస్తే, వాళ్లూ అక్కడికే వస్తారని, ఫన్ తో నడుస్తుందని ఏనాడో వెల్లడించాం.

అయితే ఇప్పుడు అదికాదు విషయం. ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యే విషయంలో నిర్మాత దిల్ రాజుకు డైరక్టర్ అనిల్ రావిపూడికి మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. సాధారణంగా దిల్ రాజుకు పర్మనెంట్ యూనిట్ వుంటుంది. కీలక సాంకేతిక నిపుణలు మారతారు కానీ మిగిలినవారు మారరు. ఇలాంటి స్టాఫ్ లో ఒకరితోనో ఇద్దరితోనో అనిల్ రావిపూడికి సెట్ కాలేదని తెలుస్తోంది.

ఆ విషయంలో దిల్ రాజు కూడా అనిల్ రావిపూడి మాట వినలేదని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. దాంతో ఒకదశలో ప్రజెక్టు వుంటుందా? వుండదా? అని వినిపించిందని, అయితే చిన్న విషయానికి అంత నిర్ణయం ఎందుకుని అనిల్ రావిపూడి ముందుకు వెళ్లారని, కానీ తరువాత మళ్లీ దిల్ రాజు బ్యానర్ లో చేయడం అనుమానమే అని టాక్.

దానికి దిల్ రాజుతో సమస్య కాదని, ఆయన స్టాఫ్ లో ఒకరిద్దరితో అనిల్ రావిపూడికి సరిపడకపోవడమే అని తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే సర్దుకుపోతున్నారు. అంతవరకు ఓకె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?