రెండు మంచి హిట్ లు ఇచ్చిన తరువాత కూడా డైరక్టర్ ఖాళీగా వుండడం ఏమిటి? అందునా ఇలా డైరక్టర్ కనిపిస్తే అలా ఎగరేసుకుపోతున్నారు టాలీవుడ్ లో. అలాంటి సమయంలో అనిల్ రావిపూడికి చేతిలో సినిమా లేదు. రామ్ తో సినిమా అనుకుంటే, కథ ఓకె కాలేదు. అదే కథను ఎన్టీఆర్ దగ్గరకు పట్టుకు వస్తే, గ్రీన్ సిగ్నల్ రావడం లేదు.
మరి ఇప్పుడు ఎవరితో చేయాలి? కళ్యాణ్ రామ్ భరోసా ఎలాగూ వుంది. కానీ మళ్లీ అక్కడే చేయాలా? మరేదైనా కాంబినేషన్ సెట్ అవుతుందా? ఇక్కడ అనిల్ రావిపూడి సమస్య కూడా వుందని వినికిడి. తన దగ్గర వున్న ఆ లైన్ నే ఏ హీరో చేత అయినా చేయించాలని ఆయన ప్రయత్నిస్తున్నారని, అలా కాకుండా డిఫరెంట్ స్క్రిప్ట్ లు పట్టుకుంటే, ఈపాటికి ఏదో ఒక సినిమా పట్టాలు ఎక్కేదని కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ఏమయినా, ఓ మాంచి మాస్ డైరక్టర్ టైమ్ అంతా వేస్ట్ అయిపోతోంది. నితిన్ లాంటి హీరో అయినా అనిల్ రావిపూడిని దగ్గరకు తీసి వుండాల్సింది. అదీ జరగలేదు.