Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనిల్ సుంకర-150 కోట్లు నష్టం?

అనిల్ సుంకర-150 కోట్లు నష్టం?

సాధారణంగా టాలీవుడ్ లో ఓ నిర్మాత మీద మిగిలిన నిర్మాతలు అంతా పాజిటివ్ గా వుండడం అన్నది అరుదు. కొందరు పాజిటివ్ వుంటే, మరి కొందరు నెగిటివ్ గా వుంటారు. మరి కొందరు బహిరంగంగా పాజిటివ్ గా వుంటే, వెనుకాల నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. కానీ ఏ ఒకరో ఇద్దరూ మాత్రం అందరి వైపుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను అందుకుంటారు. నిర్మాత అనిల్ సుంకర ఇలాంటి వాళ్లలో ఒకరు.

నిజానికి ఆయనకు టాలీవుడ్ అచ్చి రాలేదనే చెప్పాలి. 14 రీల్స్ భాగస్వామ్యంలో చేసిన రెండు మూడు సినిమాలు, ఆయన స్వంతగా చేసుకున్న రెండు మూడు సినిమాలు తప్పితే మిగిలినవన్నీ ఆయన నుంచి డబ్బులు లాగేసినవే. అమెరికాలో రకరకాల వ్యాపారాలు, తెలుగు నాట పలు వ్యాపారాలు కలిపి ఇచ్చే పైసలు అన్నీ అనిల్ సుంకర సినిమాల్లో పెట్టేస్తుంటారు. కాస్త ఇంకా ఎక్కువే పెడుతుంటారు. అదేంటో పాపం, ఈ వ్యాపారం తప్ప మిగిలినవన్నీ ఆయనకు కలిసి వచ్చినవే.

ఇప్పటికి అనిల్ సుంకర సినిమా వ్యాపారంలో వంద కోట్లకు పైగా పోగొట్టుకున్నారని లెక్కలు టాలీవుడ్ లో వినిపిస్తుంటాయి. కానీ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తారు తప్ప టెన్షన్ గా వుండరు. ఏజెంట్ సినిమా విడుదల టైమ్ లో చాలా మంది నిర్మాతల మాట ఒక్కటే. ఈ సినిమా అనిల్ సుంకర కోసమన్నా ఆడాలి అన్నదే. సురేందర్ రెడ్డి అంటే అంతగా ఇష్టం లేని వారు కూడా అనే మాట అదే, అనిల్ సుంకర కోసం ఈ సినిమా ఆడి వుంటే బాగుండేదనే.

నలభై కోట్లలో తీస్తానని చెప్పిన సినిమాకు 80 కోట్లు ఖర్చు చేయించేసినా, దర్శకుడు సురేందర్ రెడ్డిని వెనకేసుకునే వచ్చారు అనిల్ సుంకర. చివరి రోజు, విడుదలకు కొన్ని గంటల ముందు కూడా సురేందర్ రెడ్డిని పల్లెత్తు మాట పరోక్షంలో కూడా అనలేదు.

ఏజెంట్ సినిమా మీద అనిల్ సుంకరకు ఒనకూడిన నష్టం సుమారు 20 కోట్లు అని ఓ అంచనా. ఇంత నష్టం తరువాత కూడా పోగొట్టుకున్న చోట్లే వెదుక్కోవాలనే సూత్రం మీదే వుండి, సినిమాలు ప్లాన్ చేస్తున్నారు తప్ప, వెనకడుగు వేయడం లేదు.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా