తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.. మొదటి సినిమాతోనే సంచలనంగా మారాడు. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా సో..సో..గా సాగుతున్న ఇతడి కెరీర్ లో అంతకు మించిన సంచలనాలు వార్తల్లో నిలిచాయి. అప్పట్లో నటి, గాయకురాలు ఆండ్రియాతో ఇతగాడి రొమాన్స్ హాట్ టాపిక్ అయ్యింది. వీరిద్దరూ సాన్నిహిత్యంగా ఉంటూ దిగిన ఫొటోలు.. నెట్ లో వైరల్ గా నిలిచాయి. సుచీ లీక్స్ సమయంలో కూడా అనిరుధ్ పేరు ప్రముఖంగా వినిపించింది.
ఆండ్రియా అయితే ఇతడి మీద ఏమీ కంప్లైంట్ చేయలేదు. ఇద్దరూ వ్యక్తిగత ఇష్టంతో కలిసి గడిపినట్టున్నారు. ఆ తర్వాత ఎవరిదారి వారు చూసుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు దగ్గరి బంధువుగా అనిరుధ్ కు పేరు. రజనీకాంత్ అల్లుడు ధనుష్, రజనీ కూతుర్లతో కూడా సన్నిహితంగా, బంధువుగా బలమైన క్యాంపులోనే ఉన్నాడు అనిరుధ్.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు అనిరుధ్- కీర్తీ సురేష్ ల మధ్యన ప్రేమాయణం అంటూ తమిళ మీడియా మైకు అందుకుంది. వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని.. త్వరలోనే వీరి పెళ్లి కూడా అంటూ ప్రచారం సాగిస్తోంది తమిళ మీడియా. ఇలాంటివి క్రియేట్ చేయడంలో తెలుగు మీడియా కన్నా చాలా క్రియేటివ్ గా ఉంటుంది తమిళ మీడియా. ఈ క్రమంలో.. అనిరుధ్- కీర్తీ సురేష్ పెళ్లి అనే పుకారు షికారు చేస్తోంది.
వాస్తవానికి కీర్తీ సురేష్ కు ఆమె ఇంట్లోనే పెళ్లి ఆలోచన చేస్తున్నట్టుగా ఇన్నాళ్లూ వార్తలు వచ్చాయి. ఒక బిజినెస్ మ్యాన్ తో కీర్తీకి పెళ్లి అని కొన్నాళ్ల కిందట వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో అనిరుధ్- కీర్తీ అంటూ తమిళ మీడియా ప్రచారం చేసి పెడుతోంది. ఇదే నిజమైతే మొత్తానికి హీరోయిన్లను ఆకట్టుకునే కళ ఏదో అనిరుధ్ కు తెలిసి ఉండాలి!