అవకాశాలు తగ్గితే ఐటెంసాంగ్స్ చేసుకుంటారు. ఆ ఛాన్సులు కూడా అడుగంటితే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుతారు. హీరోయిన్ అంజలికి ఈ రెండు అవకాశాల్లో ఒక్కటి కూడా అందుబాటులో లేదు. ఐటెంసాంగ్స్ కు పనికొచ్చే లుక్స్, ఫిజిక్ ఆమె దగ్గర లేవు. పోనీ పెళ్లి చేసుకుందామంటే దానికింకా చాలా టైం ఉందంటోంది. మరి అంజలికి దారేది…?
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అంజలి హవా అంతంతమాత్రంగానే ఉంది. మొన్నటివరకు తమిళ్ లో ఆమెకు క్రేజ్ ఉండేది. కానీ రీసెంట్ గా అది కూడా పోయింది. ఇక తెలుగులో మొదట్నుంచి ఆమెకు పాపులారిటీ తక్కువే. కుర్రహీరోలెవరూ ఆమెను కన్సిడర్ చేయలేదు. సీనియర్ హీరోలు పట్టించుకోలేదు. దీంతో అంజలి సోలోగా ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేయడం ప్రారంభించింది. తాజాగా విడుదలైన చిత్రాంగద సినిమాతో ఇక ఆ జానర్ కు కూడా అంజలి పనికిరాదని తేలిపోయింది. దీంతో ఆమెకిప్పుడు ఒకటే దారి మిగిలింది.
ప్రస్తుతం అంజలి కన్నడ సినిమా వైపు చూస్తోంది. కనీసం శాండిల్ వుడ్ లోనైనా స్థిరపడదామని అనుకుంటోందట. తెలుగులో ఫ్లాప్ అయిన నికీషా పటేల్, కృతికర్బందా లాంటి ఎంతోమంది భామలు కన్నడనాట సక్సెస్ అయ్యారు. వాళ్ల దారిలో తను కూడా హిట్ కొట్టి, అక్కడే సెటిల్ అయిపోదామనుకుంటోందట. మరి అంజలిని ఆదుకునే ఆ కన్నడ స్టార్ ఎవరో…?