Advertisement


Home > Movies - Movie Gossip
అన్నదమ్ములుగా ఎన్టీఆర్-చెర్రీ

రాజమౌళి-రామ్ చరణ్-ఎన్టీఆర్ ల కాంబో సినిమాకు తెరవెనుక ఏర్పాట్లు మెలమెల్లగా ప్రారంభమవుతున్నాయి. జూలై ఫస్ట్ వీక్ లో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్-ఎన్టీఆర్ అన్నదమ్ములుగా కనిపించబోతున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథను తయారుచేసుకుంది రాజమౌళి టీమ్. కథను విన్న చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరూ బాగా ఇంప్రెస్ అయినట్లు బోగట్టా.

అయితే ఈ సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ మదర్ క్యారెక్టర్ వుంటుందని తెలుస్తోంది. మరి ఈ క్యారెక్టర్ కు ఈ సారి రాజమౌళి ఎవర్ని తీసుకుంటారో చూడాలి. బాహుబలి టైమ్ లో శ్రీదేవిని అనుకుని, తరువాత రమ్యకృష్ణను తీసుకున్నారు. ఈ విషయంలో శ్రీదేవి ఫీల్ అయింది కూడా.

అందువల్ల ఈసారి రాజమౌళి తన హుందాతనం నిలబెట్టుకునేందుకు శ్రీదేవిని తీసుకుంటారా? అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలా అయితే సినిమాకు బాలీవుడ్, తమిళ్ టచ్ కూడా వస్తుంది. పైగా చరణ్ ఫాదర్ తో, ఎన్టీఆర్ గ్రాండ్ ఫాదర్ లో శ్రీదేవి నటించిన వైనం కూడా వుండనే వుంది.

మొత్తం మీద రాజమౌళి తరువాతి సినిమాకు రంగం స్మూత్ గా రెడీ అవుతోంది.