అన్నపూర్ణ స్టూడియోలో ఎమ్మెల్యేలు

అన్నపూర్ణ స్టూడియో కళకళ లాడిపోతోంది. పదుల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. ఒక్కో వాహనం నుంచి ఒక్కో ఎమ్మెల్యే వస్తున్నారు. తెల్ల చొక్కాలు, పచ్చ చొక్కాలు, మెడలో పార్టీ గుర్తు కండువాలతో ఎమ్మెల్యేలు జిగేల్ మంటున్నారు.…

అన్నపూర్ణ స్టూడియో కళకళ లాడిపోతోంది. పదుల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. ఒక్కో వాహనం నుంచి ఒక్కో ఎమ్మెల్యే వస్తున్నారు. తెల్ల చొక్కాలు, పచ్చ చొక్కాలు, మెడలో పార్టీ గుర్తు కండువాలతో ఎమ్మెల్యేలు జిగేల్ మంటున్నారు.

ఇదంతా మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమా కోసమే. ఈ సినిమాలో అసెంబ్లీ సీన్ కోసం అన్నపూర్ణలో రెండు కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేసారు. అచ్చం సమైక్య రాష్ట్రంలో అసెంబ్లీ ఎలా వుండేదో, అలాగే అచ్చు గుద్దినట్లు సెట్ వేసినట్లు తెలుస్తోంది.

మరి అసెంబ్లీ అన్నాక ముఖ్యమంత్రి వుండాలి. మహేష్ బాబు వుండనే వున్నాడు. స్పీకర్ వుండాలిగా. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత స్పీకర్ గా కనిపిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా దేవరాజ్ వున్నారు. కాస్త వినోదం పుట్టించడానికి పృధ్వీ పక్కనే వున్నారు. మరి ఎమ్మెల్యేలు.

అందుకే సహజంగా వుండాలని, సినిమా ఆసక్తి వుండి, కాస్త విగ్రహం వున్నవాళ్లకు కబుర్లు అందాయి. ఎవరికి వాళ్లు, వాళ్ల వాళ్ల ఖద్దరు, కాటన్ షర్టులు, నెహ్రూ కోట్లు తెచ్చుకుని అన్నపూర్ణకు వచ్చేసారు. ఈ చెట్టు చాటున, ఆ కారు చాటున డ్రెస్ లు చేంజ్ చేసుకుని, అసెంబ్లీలోకి వెళ్లిపోయారు.

మరి ఇంతకీ సిఎమ్ గా మహేష్ బాబును, స్పీకర్ గా జయలలితను, ప్రతిపక్ష నాయుకుడిగా దేవ్ రాజ్ ను కూర్చోపెట్టి దర్శకుడు కొరటాల శివ ఏం చేయబోతున్నారో చూడాలి.