Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

అన్నీ నాన్న ఎప్పుడో రాసేసారు

అన్నీ నాన్న ఎప్పుడో రాసేసారు

మనవాళ్లకు ఓ స్టాండర్డ్ డైలాగు వుందని ఓ విమర్శవుంది. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష...అని ఓ పెద్దాయిన వెక్కిరింతగా అన్నాడు కూడా. డైరక్టర్ రాజమౌళి దగ్గర కూడా ఇలాంటి స్టాక్ డైలాగు ఒకటి వుంది. ఏదయినా సరే, ఇది మా నాన్న రాసింది. ఆయన ఎప్పుడో రాసారు అని. మగధీర కథలాంటి సీరియల్ ఓ వారపత్రికలో వచ్చాక కూడా, అది మాకు తెలియదు..మానాన్న ఎప్పుడో రాసారు అన్నారు. 

అలాగే ఇంకా చాలా..చాలా..ఇప్పుడు తాజగా శాంభవి ఐపీఎస్ , విక్రమార్కుడు సంగతి. మా నాన్న ఎప్పుడో రాసారు. అది శాంభవి ఐపీఎస్ చిత్రంలోకి ఎలా వెళ్లిందో అంటున్నారు. తమిళనాట నాడీ జ్యొతిష గ్రంధాల్లా, వేదాల్లా, రాజమౌళి డాడీ రచనల్లో ప్రపంచ సినిమాలు అన్నీ వున్నట్లున్నాయి అంటున్నారు కిట్టని వాళ్లు పాపం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?