Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అన్ని విధాల సమతూకం

అన్ని విధాల సమతూకం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోయే 175 మంది అభ్యర్థుల జాబితాను ఒకేసారి విడుదల చేసేసారు జగన్. కొన్ని ప్రకటించడం, మరికొన్ని దాచాడం ఇలాంటి వ్యవహారాలు ఏవీలేకుండా టోటల్ జాబితాను, నామినేషన్ల పర్వం ప్రారంభం కావడానికి ఒకరోజు ముందే వదిలారు. దీంతో పార్టీ జనాల్లో ఇక ఏ టెన్షన్ లేకుండా చేసినట్లు అయింది.

టికెట్ ల కేటాయింపు చూస్తుంటే జగన్ కాస్త గట్టి కసరత్తే చేసినట్లు కనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ టీమ్ బాగానే వర్కవుట్ చేసినట్లు తెలుస్తోంది. చాలాపేర్లు చాలామందికి పరిచయం లేకపోవచ్చు. అంతమాత్రం చేత ఎవరో తెలియని వాళ్లకు టికెట్ లు పంచేసినట్లు కాదు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడినవారు, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆశావహులు చాలా మందేవున్నారు. ఇలాంటి వాళ్ల పేర్లు అన్నీ సుపరిచితమే.

కానీ జగన్ ఈసారి వీలయినంత వరకు అన్ని విధాలా గెలుపుగుర్రం అనుకుంటేనే టికెట్ లు కేటాయించాలని ముందే డిసైడ్ అయిపోయారు. ఆ విషయం టికెట్ ల కేటాయింపులో కూడా క్లియర్ గా కనిపిస్తోంది. మొత్తంమీద చూసుకుంటే 60 ఏళ్ల లోపు వాళ్లే అధికంగా వుండడం విశేషం.

కాస్త తిరగగలగి, ప్రజలతో మమేకం కాగలిగిన వారినే ఎంపికచేసినట్లు కనిపిస్తోంది. అలాగే 41 స్థానాలు బిసిలకే కేటాయించారు. అయిదు సీట్లు మైనారిటీలకు, మూడు సీట్లు బ్రాహ్మణులకు కేటాయించారు. అదే విధంగా వివిధ కులాల సమతూకం వుండేలా చూసుకున్నారు. 

టిడిపియే కాదు, వైసిపి కూడా యీ సత్యం గుర్తించాలి

 వైయస్‌ పాలించినది వైసిపి పార్టీ అధినేతగా కాదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?