Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అంతరిక్షం స్థాయిలో..

అంతరిక్షం స్థాయిలో..

ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి చాలా తెలివైనవాడు. సూక్ష్మంలో మోక్షం అన్నది బాగా తెలుసు. దర్శకుడు క్రిష్ అంతకన్నా రెండు పాఠాలు ఎక్కువే చదివారు. ఘాజీ సినిమా కోసం చాలా తక్కువలో సెట్ లు వేసి, సిజి వర్క్ తో లాగించి, జనాలకు నమ్మబలికి భలే సినిమా తీసాడు అనిపించుకున్నాడు సంకల్ప్.

సముద్రం లోతుల్లో మొదటి సినిమా తీస్తే, అంతరిక్షంలో రెండో సినిమా ప్లాన్ చేసాడు. వరుణ్ తేజ్, లావణ్య తిపాఠీ, అదితిరావ్ హైదరి, రెహమాన్, శ్రీనివాస్ అవసరాల లాంటి స్టార్ కాస్ట్ తో తయారైంది అంతరిక్షం.. సినిమా. మరో పదిరోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రయిలర్ ఇప్పుడు విడుదలయింది.

సినిమా ట్రయిలర్ చూస్తే రెండు విషయాలు అర్థం అవుతాయి. ఇండియాకు ఘాజీ రూపంలో విపత్తు ఎదురైతే హీరో ప్రాణాలు ఒడ్డి కాపాడాడు. ప్రపంచానికే శాటిలైట్ కారణంగా ప్రమాదం ఎదురైతే ఇక్కడ హీరో కాపాడతాడు. అయితే ఘాజీకీ దీనికి తేడా ఒకటి వుంది. అక్కడ కేవలం డ్యూటీ మాత్రమే వుంది. కానీ ఇక్కడ డ్యూటీ, దేశభక్తి, ప్రేమ, వృత్తి రాజకీయాలు అన్నీ వున్నాయి.

ట్రయిలర్ లో చక్ చక్ మని కట్ చేయడం వల్ల కావచ్చు, ఎమోషన్స్ అంత లెవెల్లో లేవు కానీ, ట్రయిలర్ లో కనిపించని డెప్త్ సినిమాలో చాలా వుండేలా వున్నట్లు మాత్రం తెలుస్తోంది. టోటల్ గా ట్రయిలర్ మాత్రం సినిమా మీద ఫుల్ గా ఆసక్తి పెంచేలా కనిపిస్తోంది. రాజీవ్ రెడ్డి, క్రిష్ నిర్మాతలు. ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు.

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?