మారుతి కథతో దిల్ రాజు రోజులు మారాయి అనే సినిమా నిర్మిస్తున్నారు. మారుతి కథ, రోజులు మారాయి ప్రోమోలు కలిసి, సినిమా ఎలా వుంటుందనే దానిపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. మారుతి మళ్లీ తన ఓల్డ్ మార్క్ చూపిస్తాడా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అయితే సెన్సారు అనంతర టాక్ చూస్తే, అంత లేదని, ఇది డిఫరెంట్ జోనర్ సినిమా మాత్రమే అని తెలుస్తోంది. కేవలం అయిదారు పదాలు, అది కూడా కేవలం మ్యూట్ చేయమని చెప్పి, సెన్సార్ వితవుట్ కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిందట. తొలిసగం అంతా హిలేరియస్ గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిందని, సెకండాఫ్ ఊహించని ట్విస్ట్ లతో సాగుతుందని తెలుస్తోంది.
అసలే ఇటీవల దిల్ రాజు పట్టింది బంగారం అవుతోంది. ఈ లెక్కన ఇది కూడా కాస్త పైసలు తెచ్చి పెట్టేలాగే వుంది.