ప్రేమమ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి, అ..ఆ, శతమానం భవతి సినిమాలతో మాంచి గుర్తింపు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్. కానీ అంతకుమించి ముందుకు వెళ్లలేకపోయింది. అంతేకాదు, సరైన ప్రాధాన్యత వున్న పాత్రలు కూడా దొరకడంలేదు. హలోగురూ ప్రేమకోసమే సినిమాలో మంచి పాత్రనే దొరికింది కానీ సినిమా విజయం సాధించలేదు. దాంతో కథ మొదటికి వచ్చింది. లేటెస్ట్ గా రాక్షసుడు సినిమాలో చేసింది అనుపమ.
వాస్తవానికి ఈ పాత్రకు ముందుగా రాశీఖన్నాని అనుకున్నారు. మళ్లీ ఏమయిందో కానీ అనుపమ సినిమాలోకి వచ్చింది. కానీ తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే, అనుపమ పాత్ర సినిమాలో చాలా చిన్నదే. క్లయిమాక్స్ లో కథతో సరైన కనెక్షన్ వుంది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే అస్సలు గుర్తువుండే పాత్ర కాదు.
ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల కొరత ఎక్కువగా వుంది. అయినా కూడా అనుపమ వంక ఎవరూ చూస్తున్నట్లు కనిపించడం లేదు. ఎవరెవర్నో ట్రయ్ చేస్తున్నారు కానీ అనుపమ దగ్గరకు వస్తున్నట్లు లేదు. అనుపమ హైట్ తక్కువ అనేమాట వుంది. కానీ మరి రష్మికను వెదుక్కుంటూ చాన్స్ లు వస్తున్నాయి. అమె కూడా హైట్ తక్కువేకదా?
నటనలో కూడా అనుపమ ఫరవాలేదు? గ్లామర్ కు కూడా తీసిపోనని ఇటీవల తెగ ఫోటోలు తీసి ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తోంది అనుపమ. కానీ అవేవీ టాలీవుడ్ జనాల దృష్టిని ఆకర్షిస్తున్నట్లు లేదు. ఇలా అయితే అనుపమ ఇలా చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయిపోతుందేమో?