బాగా ఒళ్లు చేసిందనే నెపంతో ఈమధ్య అనుష్కని కాదని వేరే హీరోయిన్లని తీసుకున్నారు కొందరు నిర్మాతలు. సైజ్ జీరో చిత్రం కోసం ఒళ్లు పెంచిన అనుష్క ఆ తర్వాత సన్నబడలేకపోయింది. బాహుబలి సినిమాలోను అలాగే నటించిన అనుష్కని సన్నగా చూపించడం కోసం రాజమౌళి విజువల్ ఎఫెక్ట్స్ సాయం తీసుకోవాల్సి వచ్చింది.
బాహుబలి తర్వాత పలు భారీ చిత్రాల్లో నటించే అవకాశాలు వరించినట్టే వరించి అనుష్క చేజారాయి. సైరా నరసింహారెడ్డి, సాహో చిత్రాల్లో అనుష్కని ఖరారు చేసుకుని కూడా కాదనుకున్నారు. దీంతో అనుష్క బాగా హర్ట్ అయి మిషన్ వెయిట్ లాస్‌పై కాన్సన్‌ట్రేట్ చేస్తోంది. ఇప్పటికే కొన్ని కిలోల బరువు తగ్గిన అనుష్క సహజ పద్ధతుల్లో బరువు తగ్గడం కోసం కేరళ ఆయుర్వేదంపై ఆధారపడుతోంది.
కొద్ది నెలల పాటు కేరళలోనే వుండి ప్రకృతి చికిత్స తీసుకునే నిమిత్తం ఆమె అక్కడికి వెళుతోంది. ఈలోగా కొత్త సినిమాలేవీ ఆమె అంగీకరించడం లేదని తెలిసింది. అనుష్క నటించిన 'భాగమతి' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడం కోసం యువి క్రియేషన్స్ సన్నాహాలు చేసుకుంటోంది.