ఆయన చూస్తే అటు రాజకీయాల్లో కిందా మీదా అవుతున్నంత సీన్ కనిపిస్తోంది. లాల్చీ వేసుకుని, చేతిలో చిన్న డైరీ పట్టుకుని, రాజకీయ సమాలోచనలు, మీడియా ముచ్చట్లు చేస్తూ, తెగ హైరానా పడిపోతున్నంత బిల్డప్ కనిపిస్తోంది. కానీ ఇక్కడ చూస్తే, పవన్ డేట్లు ఇస్తున్నారు. పక్కా, ఏప్రియల్ నుంచి లేదా మహా అయితే మే నుంచి సెట్ మీదకు వెళ్లడం పక్కా అనే వార్తలు వినిపిస్తున్నాయి.
మైత్రీ మూవీస్ నిర్మాణంలో సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఆశలు ఇంకా అడుగంటి పోలేదు. పవన్ స్క్రిప్ట్ ను పూర్తిగా ఓకె చేసి వుంచారని తెలుస్తోంది.
తమిళ సినిమా హక్కులు తీసుకున్నా, టోటల్ గా స్క్రిప్ట్ ను పవన్ స్టయిల్ కు అనుగుణంగా మార్చేసి సిద్దం చేసారట సంతోష్ శ్రీనివాస్. ఎలాగైనా పవన్ ఒకె అంటారని పూర్తి నమ్మకంతో వున్నారట.
పైగా అన్ని వైపుల నుంచి కూడా సినిమాలు వదలవద్దని పవన్ కు బహిరంగ రిక్వెస్ట్ లు వస్తున్నాయి. పైగా ఈ స్పెషల్ స్టేటస్ ఉద్యమం ఏ టర్న్ తీసుకుంటుందో, సద్దుమణుగుతుందో తెలియదు.
సద్దుమణిగితే కనుక పవన్ సినిమాకు రెడీ అంటారని తెలుస్తోంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో పవన్ భేటీ వుంటుందని తెలుస్తోంది. అన్నీఅనుకున్నట్లు జరిగితే త్వరలోనే పవన్ సెట్ మీదకు వస్తారని వినిపిస్తోంది.